Home / 18+ / సిద్ధాంతపరంగా, చంద్రబాబుపై నమ్మకం లేక, ఓటమి భయం ఈ మూడు కారణాలతో టీడీపీ నేతలు ఏం చేస్తున్నారో తెలుసా.?

సిద్ధాంతపరంగా, చంద్రబాబుపై నమ్మకం లేక, ఓటమి భయం ఈ మూడు కారణాలతో టీడీపీ నేతలు ఏం చేస్తున్నారో తెలుసా.?

ఏపీలో నియోజకవర్గ పునర్విభజన లేనట్లేనని తేలిపోయింది.. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు వికటించడంతో ఏపీలోనూ పొత్తు ఉంటుందని భావిస్తున్న టీడీపీపై అభిమానం ఉన్న నేతలు ఆపార్టీని వీడేందుకు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మిగిలిపోయిన కాంగ్రెస్ నేతలు సీనియర్ టీడీపీ నేతలు సుముఖంగా ఉన్నారు. కాంగ్రెస్ లో బలమైన నేతలుగా గుర్తింపుపొంది విభజనానంతరం స్థబ్ధుగా ఉన్న అనేకమంది కాంగ్రెస్ నేతలు జగన్ పార్టీ వైపు చూస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన త్వరలో జరుగుతుందనుకున్న సమయంలో టీడీపీలో వెళ్లాలనుకున్న నేతలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు.

దీంతో ఇప్పుడు వైసీపీ ఓవర్ లోడ్ అయ్యే అవకాశం కన్పిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేల మధ్య యుద్ధమే నడుస్తుంది. ఈ తరుణంలో నియోజకవర్గాలు పెరుగుతాయని భావించి కాంగ్రెస్ నేతలు కొండ్రు మురళి, డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి వాళ్లు టీడీపీలో చేరారు. అప్పటికే తాము ఆశించిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఉండటంతో పునర్విభజన జరిగితే అక్కడి టీడీపీ నేతలను పక్క నియోజకవర్గానికి పంపించి తమకు టిక్కెట్లు చంద్రబాబు ఇస్తారన్నది వీరి ఆలోచన. ఈ నేపథ్యంలో వీరిలో చాలామంది వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం.

ఇక వైసీపీ అధినేత జగన్ దృష్టికి కూడా కొందరు టీడీపీ, కాంగ్రెస్ నేతల జాబితా చేరింది. వారు చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తేలింది. అయితే ఈ జాబితాను పార్టీ సీనియర్ టీం కు అప్పగించినట్లు సమాచారం. పాదయాత్ర తర్వాత వైసీపీకి మైలేజ్ పెరగడంతో వైసీపీలో భారీగా చేరికలుంటాయని తెలుస్తోంది. దీనికితోడు తెలంగాణ ఎన్నికల్లో కూటమికి జరిగిన ఘోర పరాభవంలో చంద్రబాబు పాత్ర ఎక్కువగా ఉండడం పట్ల ఏపీలో ఆ ఎఫెక్ట్ కచ్చితంగా పడుతుందని ముందే మూటా ముల్లు సర్ధుకుందామని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

గతంలో కేఈ కృష్ణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి సీరియర్లు బాహాటంగానే పొత్తు విషయంలో చంద్రబాబును దారుణంగా విమర్శించిన నేపధ్యంలో కచ్చితంగా ఎన్నికలలోపు సిద్ధాంతపరంగా కొందరు, టీడీపీ అధినేతపై నమ్మకం సన్నగిల్లి కొందరు ముఖ్యంగా ఓటమి భయంతో ఎక్కువమంది ఫ్యాను గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat