Home / 18+ / టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్..!!

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్ (కార్యనిర్వాహక అధ్యక్షుడు)గా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పరంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యతలు తనపై ఉన్న దృష్ట్యా, అత్యంత నమ్మకస్తుడు, సమర్ధుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని గమ్యానికి చేర్చి, ప్రత్యేక రాష్ట్రం సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ, బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా బలమైన అడుగులు వేసింది. తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని ప్రజలు ఏకోన్ముఖంగా భావించి, ఇటీవల ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించారు.
తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీపై అచంచల విశ్వాసం ఉంది. తెలంగాణ భవిష్యత్తుకు టిఆర్ఎస్ అత్యంత పటిష్టంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.

జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండడంతో కేసీఆర్ పై పనిభారం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీని తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను, పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్ కు కేసీఆర్ అప్పగించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టిఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దే బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారు. భారతదేశంలోనే అతి గొప్ప పార్టీగా టిఆర్ఎస్ ను రూపుదిద్దాలనే సంకల్పంతో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటి వరకు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో ఇచ్చిన బాధ్యతలన్నీ అత్యంత విజయవంతంగా నిర్వహించిన కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు. కేటీఆర్ పనితీరు, నిబద్ధత, దార్శనికత,నాయకత్వ లక్షణాలు టిఆర్ఎస్ పార్టీని సుస్థిరంగా, సుభిక్షంగా నిలుపుతాయని కేసీఆర్ విశ్వసిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat