Home / 18+ / విషయం తెలిసిన కొద్ది గంటల్లోపే చర్యలు తీసుకున్న జగన్.. అదే స్థానంలో చంద్రబాబు ఉంటే

విషయం తెలిసిన కొద్ది గంటల్లోపే చర్యలు తీసుకున్న జగన్.. అదే స్థానంలో చంద్రబాబు ఉంటే

తాజాగా తెలంగాణ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏ రాజకీయ పార్టీకిగానీ, వ్యక్తికిగానీ అధికారికంగా మద్దతివ్వలేదు. కానీ పార్టీ అభిమానులు వ్యక్తిగతంగా తమకు నచ్చిన పార్టీలను ప్రోత్సమించుకున్నారు. ఎవ్వరీ అధికారికంగా మద్దతివ్వమని వైసీపీ ప్రకటించింది. ఇందులో ఏ మార్పు లేదు. మా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎవరికి ఓటు వేయాలన్న అంశంపై వైసీపీ ఓటర్లు ఆత్మసాక్షి మేరకు ఈ నిర్ణయాన్ని వదిలేసింది. అయితే ఓటర్లకు తప్పుడు సంకేతాలు పంపేలా పార్టీ తెలంగాణ జనరల్‌ సెక్రటరీగా ఉన్న కే. శివకుమార్‌ పార్టీ లెటర్‌ హెడ్‌ ఉపయోగించి వైసీపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్టు ప్రకటించేసారు. దీంతో కే. శివకుమార్‌ ఇచ్చిన ప్రకటనను వైసీపీ తీవ్ర క్రమశిక్షణ రాహిత్యంగా భావించి పార్టీ క్రమశిక్షణా సంఘం అత్యవసరంగా చర్చించి ఆయన్ను శాశ్వతంగా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రకటన ఇచ్చిన కొద్ది గంటల్లోనే చర్యలు తీసుకుంది.

అయితే కాంగ్రెస్ పార్టీ తమకు రాజకీయ శత్రుత్వం ఉన్న పార్టీ అని జగన్ ఎప్పుడో ప్రకటించారు. అలాగే టీడీపీతో ఉన్న వైరుధ్యం ఏమాత్రం చెప్పాల్సన పనిలేదు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీలతో స్నేహపూర్వక వాతావారణం ఉన్నది అందరికీ తెలిసిందే. జగన్ పై దాడిని కూడా ఆయా పార్టీల నేతలు ఖండించారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి ప్రకటన ఇస్తేనే వైసీపీ ఆ వ్యక్తిని సస్పెండ్ చేసింది, కానీ తెలుగుదేశం నేతలు మొన్నటివరకూ బీజేపీ పొత్తతో కలిసిఉన్నా కాంగ్రెస్ నేతలతో కలిసితిరిగారు. ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి ఉంటున్నా ఆపార్టీ ఎంపీలు నిస్సిగ్గుగా బీజేపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలాగే ఎవరెన్ని అక్రమాలు చేసినా కనీసం చంద్రబాబు మందలించకపోవడం ఆయన క్రెడిబులిటీకి అద్దం పడుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat