Home / 18+ / ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత….టీడీపీకి షాక్

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత….టీడీపీకి షాక్

ఈ రోజుల్లో మనుషులకంటే విగ్రహాలకే ప్రాధాన్యత ఎక్కువ.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోకుండా విగ్రహాలకు కోట్లు పెడుతున్నారు.ఉక్కు మనిషి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ కు నివాళిగా ప్రధాని మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నదీ తీరంలో ఒక భారీ కంచు విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరించిన విషయం అందరికి తెలిసిందే.

ఆ విగ్రహ ఏర్పాటుకైన ఖర్చు దాదాపు రూ.3000 కోట్లు అయింది.దీంతో దేశ వ్యాప్తంగా మోదీ ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి. అప్పులు కట్ట లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడు తుంటే వేల కోట్లు వెచ్చించి విగ్రహాలు నిర్మించడమేంటని చాలామంది విమర్శించారు. సర్దార్ విగ్రహ ఏర్పాటుతో నదీతీరానికి పర్యావరణ పరంగానూ తీవ్రంగా నష్టం జరిగిందని విమర్శలొచ్చాయి. అందుకే విగ్రహా విష్కరణ కార్యక్రమాన్ని నర్మదా తీరంలోని గ్రామాలన్నీ బహిష్కరించాయి.

అంతటి గొప్ప యోధుని స్మారకస్థూప నిర్మాణమే విమర్శలపాలైంది.అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో నీరుకొండపై స్వర్గీయ ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అన్న గారి విగ్రహ ఏర్పాటుపై ఎవరికీ అభ్యంతరాలు లేనప్పటికీ అందుకు చేయనున్న ఖర్చు పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? అంటూ పెదవి విరుస్తున్నారు. రాష్ట్రాన్ని రాజధానిని టూరిజం అట్రాక్షన్స్ గా మార్చేందుకు ఇతర మార్గాలే లేవా? అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి నీరుకొండపై70 – 80ఎకరాల విస్తీర్ణంలో ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం తొలుత భావించింది ఏమైందో తెలియదు గానీ మొన్నటికిమొన్న ఈ ప్రాజెక్టు విస్తీర్ణాన్ని ఒక్కసారిగా 200 ఎకరాలకు పెంచింది. 32 మీటర్ల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.అసలు ఆ స్థూపనిర్మాణం చంద్రబాబు ప్రారంభించటం ఎన్టీఆర్ కు గౌరవప్రదం కాదని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల అభిప్రాయం.

ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టులో, స్టార్ హోటళ్లు, ఆడిటోరియం, వాటర్ ఫ్రంట్, సెల్ఫీ పాయింట్ వంటి అనేక హంగులు కల్పించనున్నట్లు కూడా ప్రకటించింది. అయితే – రాష్ట్రాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే ఇతర మార్గాలు ఏవె లేవా? అంటూ చంద్రబాబు ప్రభుత్వం పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్కరి స్మారక నిర్మాణం కోసం ఇంతటి భారీ ఖర్చు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ఒక వైపు రాష్ట్రంలో అన్నదాత లు అప్పుల ఊబిలో కూరుకు పోతుంటే ఒక్క విగ్రహఏర్పాటుకు వందల కోట్లు వెచ్చించటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యావత్ భారతదేశాన్ని నియంత్రించే కేంద్ర ప్రభుత్వం రూ.3000 కోట్లు పెడితేనే అంతగా విమర్శలు వెల్లువెత్తాయి. మరి చంద్రబాబు రూ.400 కోట్లకు పైగా ఖర్చు పెట్టి విగ్రహం నిర్మిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో? జనం ఎంతగా ఆగ్రహిస్తారో? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!