Home / 18+ / టీఆర్ఎస్ ప్రకట‌న‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ..సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

టీఆర్ఎస్ ప్రకట‌న‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ..సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

సంచ‌ల‌న రీతిలో సీట్ల‌ను కైవ‌సం చేసుకొని టీఆర్ఎస్ విజయంతో కేసీఆర్ తెలంగాణాకు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్ఎస్ పార్టీ సాధించిన ఈ బ్రహ్మండ‌మైన విజ‌యం గురించి ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చగా మారింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఈ గెలుపు గురించే మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఈ ప్రచారానికి సంబంధించిన ఓప్రక‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

 

ప్రముఖ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ ప్రక‌ట‌న హ‌ల్ చ‌ల్ చేస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో గులాబీ రంగు పులిమి TRS అక్షరాలు కలిసివచ్చేలా Totally Rocking Styles అని యాడ్‌ని సదరు షాపింగ్ మాల్ ఇచ్చింది. ఈ షాపింగ్ మాల్ కొటేషన్ కూడా `ఎక్కువ శాతం ప్రజల మద్దతు ఉన్న ఏకైక‌ షాపింగ్ మాల్…ఇది సామాన్యుల షాపింగ్ మాల్ ‘ అంటూ మరో కొటేషన్ కూడా ప్రకటనకు ఇచ్చారు ఆ పోస్టర్ మీద. ప్రస్తుతం టీఆర్ఎస్ ఘనవిజయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

 

ఇటువంటి సమయంలో TRS అక్షరాలు కలిసివచ్చేలా యాడ్ వేయించడం మంచి టైమింగ్ అంటూ బిజినెస్ అనుభవస్థులు కూడా కామెంట్ చేస్తున్నారు. యూత్ ఐకాన్‌గా పేరున్న విజయ్ దేవరకొండ KLM షాపింగ్ మాల్‌కు ప్రచారకర్తగా ఉండటంతో ఇది అన్నిటికంటే ఎక్కువ వైరల్ అవుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat