Home / 18+ / భగత్ సింగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

భగత్ సింగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

భగత్ సింగ్ ఒక మండే అగ్ని గోళం. జ్వలించే నిప్పుకణిక. విప్లవ పతాక.ఆయన పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అతి చిన్న వయసులోనే అంటే 23 ఏళ్ల వయసులోనే… స్వాతంత్ర్యం కోసం పోరాడి… ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. డల్లాస్‌ వేదికగా జరిగిన జనసేన ప్రవాసగర్జనలో పవన్‌ కల్యాణ్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్ర్య సమరయోధులను ఉద్దేశిస్తూ భగత్‌ సింగ్‌ పేరును ప్రస్తావించారు.

ఆయన చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోయారనే విషయం తెలుస్తుందని వ్యాఖ్యానించారు.అయితే భగత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకోలేదని, దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్‌ వారిపై హింసాత్మక ఉద్యమం చేపట్టి.. వారి చేతిలో ఉరితీయబడ్డారని అందరికీ తెలిసిందే. కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం పొరపాటుగా భగత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.అయితే చంద్రశేఖర్‌ అజాద్‌ పేరు బదులు భగత్‌ సింగ్‌ పేరును పొరపాటుగా ప్రస్తావించారని పవన్ అభిమానులు సమర్ధించుకుంటున్నారు. బ్రిటీష్‌ పోలీసులు చుట్టుముట్టడంతో ‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అంటూ చిన్నప్పుడు చేసిన శపథం నిజం చేస్తూ ఆజాద్‌ తన తుపాకీతో కాల్చుకుని వీరమరణం పొందిన విషయం తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat