Home / ANDHRAPRADESH / వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుండి మంత్రి అచ్చెన్నాయుడు చిత్తు..చిత్తుగా ఓటమీ

వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుండి మంత్రి అచ్చెన్నాయుడు చిత్తు..చిత్తుగా ఓటమీ

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించలని ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ గత 326 రోజులుగా ప్రజల్లోనే పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో పెద్ద తలకాయలను టార్గెట్‌ చెయ్యబోతున్నారా? టీడీపీలో ఉన్న పలువురు సీనియర్లను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి వారు అసెంబ్లీలో లేకుండా చెయ్యాలని జగన్‌ ఎత్తుగడ వేస్తున్నారా ? అంటే వైసీపీలో తాజా రాజకీయ పరిణామాలు.. జగన్‌ తాజా వ్యూహాత్మక ఎత్తుగడలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. జగన్‌కు ఏపీ టీడీపీలో కొంత మంది సీనియర్లతో పాటు కేబినెట్‌లో ఉన్న మంత్రులు కొరకరాని కొయ్యలుగా మారారు. జగన్‌ను పదే పదే మాటల తూటాలతో టార్గెట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వారు ప్రాధినిత్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారిని ఓడించి వచ్చే అసెంబ్లీలో వారు లేకుండా చెయ్యాలన్నదే జగన్‌ ప్లాన్‌. ఈ విషయాన్ని కొందరు వైసీపీ నాయకులు కూడా ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. జగన్‌ను ప్రముఖంగా టార్గెట్‌ చేసినవారిలో జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు ఏపీలో కీలకమైన రాజధాని జిల్లా అయిన గుంటూరు జిల్లాలో ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు ఉన్నారు. జగన్‌ వచ్చే ఎన్నికల్లో ఏపీ కేబినెట్‌లో కీలకంగా ఉన్న ఈ మంత్రులను ఓడించడం ద్వారా టీడీపీకి పెద్ద షాకే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

పాదయాత్ర ఎంట్రీతో…
టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడును చిత్తుగా ఓడించాలని వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం ఆదిత్య కళ్యాణ మండపలో టెక్కలి నియోజకవర్గ వైసీపీ కార్యక ర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ లో విపక్షం అడ్డుపడడంతోనే జగన్‌ పాదయాత్రకు పూనుకున్న విషయాన్ని గుర్తుచేశారు. మంత్రి జగన్‌ను అసభ్య పదజాలంతో తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. టెక్కలి నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర ఈనెల 18న ప్రారంభమవుతుందని.. 22న టెక్కలిలో బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభతోనే మంత్రి అచ్చెన్నకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమవుతుందన్నారు.