Home / 18+ / దెందులూరుపై జగన్ స్కెచ్.. అబ్బయ్య చౌదరి దెబ్బకి చింతమనేనికి చుక్కలు.. పవన్ కళ్యాణ్

దెందులూరుపై జగన్ స్కెచ్.. అబ్బయ్య చౌదరి దెబ్బకి చింతమనేనికి చుక్కలు.. పవన్ కళ్యాణ్

ప్ర‌భుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కు వివాదాలు కొత్తేమీ కాదు.. ఆయన రాజ‌కీయ ప‌య‌నం పూర్తిగా వివాదాల మ‌యంగానే క‌నిపిస్తుంది. విప‌క్షంలో ఉన్నా, పాల‌క‌ప‌క్షంలో ఉన్నా చింతమనేని అలాంటి చింత‌మ‌నేనిపై ఇప్పుడు రాజకీయ మూకుమ్మ‌డి దాడి జరుగుతుండ‌డంతో చింత‌మ‌నేనిరి ఊపిరాడడం లేదు. వాస్త‌వానికి దెందులూరుపై చింత‌మనేని కి గ‌ట్టి ప‌ట్టుంది. అందుకే ఆయన ఇన్నిసార్లు గెలిచారు. నియోజకవర్గంలోని నాలుగు మండ‌లాల్లో ఆయ‌న క్యాడ‌ర్, బంధువులు, అనుచ‌రులు ఉన్నారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారుతోంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైఎస్సార్సీపీ గ‌ట్టి అభ్య‌ర్థిని బ‌రిలో దింపింది. చింత‌మ‌నేని సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఇంగ్లాండ్ లో ఉద్యోగం చేసుకుంటున్న యువ‌కుడు అబ్బ‌య్య చౌద‌రిని తెర‌మీద‌కు తీసుకొచ్చారు. అబ్బ‌య్య చౌద‌రి నేరుగా చింత‌మ‌నేని ల‌క్ష్యంగా సాగుతున్నారు. దాంతో అబ్బ‌య్య చౌద‌రి వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారుతోంది. అలాగే జ‌న‌సేన నుండి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీన్ లోకి వ‌చ్చారు.

చింత‌మ‌నేని ప‌ర్స‌న‌ల్ గా టార్గెట్ చేసారు. 27 కేసులున్నాయి.. అతను రెచ్చిపోతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నార‌ని నిల‌దీశారు.. దానికి చింత‌మనేని కూడా కౌంట‌ర్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు చింత‌మ‌నేనికి ఇరువైపులా దరువు అన్న‌ట్టుగా మారింది. అయితే సరిగ్గా ఇదే స‌మ‌యంలో సొంత సామాజిక‌వ‌ర్గం నేత‌లే ప్ర‌త్య‌ర్థులుగా మారారని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ గట్టిగా విమర్శించినా జనసేన అభ్యర్ధి లేకపోవడంతో ఆ ఊపు వైసీపీకి ఉపయోగపడుతోంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకురౌడీ, వీధి రౌడీ అంటూ ప్రజలంతా ఇప్పుడు నమ్ముతున్నారు. గతంలో మాజీ మంత్రి వట్టి వసంతరావు పై చేయి చేసుకున్న కేసులో న్యాయస్థానం ఆయనకు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది. దే సమయంలో ఎంపీ కావూరి సాంబశివరావు పైన కూడా దౌర్జన్యం చేశారన్న ఆరోపణలున్నాయి. వసంత్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతూ వచ్చిన భోమడోలు మెజిస్ట్రేట్.. చింతమనేని దోషిగా ప్రకటించింది. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5వేలు జరిమాన విధించింది. వనజాక్షిని కొట్టడం, ట్రాఫిక్ పోలీసులపై, జర్నలిస్టులపై, కార్యకర్తలపై దాడి, ఇసుక వివాదం, నాయకుల పై దూషణలు, ఉద్యోగులపై దూషణలు, పార్టీ కాని వారి పై దాడులు చేయడం, చెరువుల వివాదం, వంటివి సహజంగానే జరుగుతుండడంతో ఈయనపై అసహనం పెరిగిపోయింది.

దెందులూరు రాజకీయ పరిణామ క్రమం పరిశీలిస్తే..

దెందులూరు నుంచి1989 లో మాగంటి రవీంధ్రనాధ్ చౌదరి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1991లో నేదురుమల్లి క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది సేపటికే గుండెపోటుతో మరణించారు.. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఆయన భార్య వరలక్ష్మి గెలిచారు.

ఇక 2004 ఎన్నికల్లో మాగంటి తనయుడు వెంకటేశ్వరరావు (బాబు) కాంగ్రెస్ తరపున నిలబడి గెలిచారు.. మంత్రిగా వైయస్ ఆయనకు అవకాశం ఇచ్చారు.
ఇక మాగంటి ఫ్యామిలీలో తండ్రి తల్లి తనయుడు మంత్రులుగా చేసి ఏపీలో చరిత్ర సృష్టించారు. ఆ సమయంలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో నైతిక బాధ్యత వహించి మంత్రిపదవి వదులుకున్నారు.

అనంతరం ఆయన తెలుగుదేశంలో చేరగా.. 2009 ఎన్నికల్లో చంద్రబాబు ఆయనకు ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారు ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.. 2014 లో కూడా ఆయనకు చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో ఆయన ఏలూరు ఎంపీగా గెలిచారు.
ఇక 2009 ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్ కు దెందులూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు..

దెందులూరులో కాంగ్రెస్ హావాలో గెలవడంతో ఆయనకు రెండవ టర్మ్ లో కూడా టికెట్ ఇచ్చారు చంద్రబాబు.. దీంతో 2014 ఎన్నికల్లో కూడా చింతమనేని గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయనకు మంత్రి పదవి వస్తుంది అనుకున్నా ఇవ్వకుండా ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారు చంద్రబాబు.
ఇక ఇక్కడ 2009 లో కొఠారు రామచంద్రరావు కాంగ్రెస్ తరపున చింతమనేని ప్రభాకర్ పై నిలబడి ఓటమి పాలయ్యారు..

ఇక కాంగ్రెస్ పార్టీ 2014 లో ఏపీలో ఉనికిని కోల్పోయి జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్ధాపించడంతో తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు ఇక్కడ సీటు ఇచ్చారు.. ఆయన స్ధానికుడు కాకపోవడం, సామాజిక అంశాల లెక్కల్లో కారుమూరి ఓటమిపాలయ్యారు.. అప్పటినుంచి ఇక్కడ బాధ్యతలు కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన కొఠారు రామచంద్రరావుకు అప్పగించారు జగన్.. ఇటీవల ఆయన తనయుడు కొఠారు అబ్బయ్య చౌదరి యూకే నుంచి రావడంతో ఆయన పార్టీ పగ్గాలు అందుకున్నారు.

వయసుతో భేదం లేకుండా తండ్రి వెనుక ఉన్నకేడర్ తో ముందుకు వెళుతున్నారు అబ్బయ్య.. దెందులూరు సీటులో అబ్బయ్య చౌదరిని నిలబడమని కొఠారు ఫ్యామిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్. ఇక టీడీపీలో చింతమనేని తప్ప ఎవరికి ఇక్కడ సీటు ఇవ్వడానికి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఈ వరుస రాజకీయ పరిణామ క్రమంలో మొన్నటివరకూ తనకు దెందులూరులో తిరుగులేదనుకున్న చింతమనేని ఓటమి భయంతో వణికిపోతున్నారట.. కొడంగల్ లో రేవంత్ రెడ్డి మాదిరిగా పైకి తనకు తిరుగులేదని చెప్పుకునే చింతమనేని అంతకుమించి దారుణమైన ఓట్ల తేడాతో ఓడిపోతారని తెలుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat