Home / 18+ / నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు…రోజుకో మాట మారుస్తున్న ప్రభుత్వం

నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు…రోజుకో మాట మారుస్తున్న ప్రభుత్వం

2014 ఎన్నికల ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి..’ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై రోజుకో మాట.. పూటకో నిర్ణయం తీసుకుంటూ గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులతో చెలగాటమాడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు.నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలం వెళ్లదీసిన ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ అరొకర పోస్టులు ప్రకటించిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మొన్న విడుదల చేసిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం 1,051 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులన్నింటినీ ప్రభుత్వం భర్తీ చేస్తుందనే ఆశతో మూడేళ్లుగా సుమారు 7 లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌ కోసం విద్యార్ధులు లక్షలు ఖర్చుపెట్టుకుని పట్టణాలకు వెళ్లి కోచింగ్‌ తీసుకుంటున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం కేవలం 1051 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో వారి ఆశలు అన్ని నిరాశగా మిగిలిపోయాయి.తాజా నోటిఫికేషన్‌లో వైఎస్సార్‌ జిల్లాలో ఒక్క పోస్టు కూడా లేకపోవడం దారుణమని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మే నెలలో ఇచ్చిన జీవోలో 104 ఖాళీలు చూపించి ఇప్పుడు ఒక్కటీ లేదనడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో కృష్ణా, గుంటూరు, వెస్ట్‌ గోదావరి జిల్లాల్లో పోస్టులను భారీగా కుదించారు. కొన్ని రిజర్వేషన్‌ కేటగిరిల్లోనూ ఒక్క పోస్టు కూడా లేకపోవడం గమనార్హం.ఇది ఎలా ఉండగా మొన్న పోలీస్ నోటిఫికేషన్ లో కూడా జిల్లా వారిగా చూసుకుంటే కృష్ణ,గుంటూరు ఇలా రాజధాని పరిసరాల ప్రాంతాలలోనే ఎక్కువ పోస్టలు ఇవ్వడం పై అందరికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

2017 అక్టోబర్‌ 9న దీపావళి సందర్భంగా 5,800 పంచాయతీ కార్యదర్శి పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేష్‌ ప్రకటించారు.కానీ మొన్న డిసెంబర్‌ 21న 1051 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసారు.2017లో 5,800 వేల ఖాళీలు చూపించిన ప్రభుత్వం, ఇప్పుడు 1051కి తగ్గించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat