Home / SLIDER / వివో బంపర్ ఆఫర్..కేవలం రూ. 101కే స్మార్ట్‌ఫోన్..!!

వివో బంపర్ ఆఫర్..కేవలం రూ. 101కే స్మార్ట్‌ఫోన్..!!

క్రిస్మస్,నూతన సంవత్సరం,సంక్రాంతి..పండుగలను పురస్కరించుకొని పలు మొబైల్ తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే విధంగా బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే స్మార్ట్ ఫోన్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు పోతున్న వివో కంపెనీ నూతన సంవత్సరం సందర‍్భంగా మొబైల్ వినియోగదారులకు అద్బుతమైన ఆఫర్‌ ప్రకటించింది. న్యూఫోన్‌, న్యూ ఆఫర్‌ పేరుతో కేవలం రూ.101 చెల్లించు అంటూ సరికొత్త ఆఫర్ న్ని తీసుకొచ్చింది.అయితే ఈ ఆఫర్‌ ఈ నెల 20 నుంచి వచ్చే నెల 21 వరకు అందుబాటులో ఉండనునట్లు తెలిపింది . దీని ద్వారా వివో ఆన్‌ నెక్స్‌, వివో వి11 ప్రొ, వివో వి11, వివో వై 95, వివో వై 83, వివో వై 81 (4జీ) స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చు. మొదట 101 రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి పైన పేర్కొన్న వాటిలో నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అనంతరం ఫోన్‌ విలువ మొత్తాన్ని ఆరు సులభ ఈఎంఐ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది.