Breaking News
Home / 18+ / అర్ధరాత్రి మిస్డ్ కాల్స్…అకౌంట్‌లో రూ.2 కోట్లు మాయం..

అర్ధరాత్రి మిస్డ్ కాల్స్…అకౌంట్‌లో రూ.2 కోట్లు మాయం..

కేవలం మిస్డ్ కాల్స్ కారణంగా దాదాపు రెండు కోట్ల రూపాయల సొమ్ము కోల్పోయాడు ఓ బిజినెస్ మ్యాన్.యూకే కోడ్‌తో వచ్చిన ఆరు మిస్డ్ కాల్స్ తర్వాత…. అకౌంట్‌లో నుంచి రూ. 1.86 కోట్లు మాయమయ్యాయి. పెరుగుతున్న సైబర్ నేరగాళ్ల టెక్నాలజీకి పరాకాష్టగా కనిపిస్తున్న ఈ సంఘటన… ముంబైలో వెలుగుచూసింది. వీ షా అనే వ్యక్తి ముంబైలోని మహిమ్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు.

ఒకరోజు అర్ధరాత్రి 2 గంటలకు షాకి ఒకే నెంబర్ తో ఆరు మిస్డ్ కాల్స్ వచ్చాయి.(+44) డైలింగ్ కోడ్‌తో వచ్చిన మిస్డ్‌ కాల్‌ను ఉదయాన్నే చుసిన షా… తిరిగి ఆ నెంబర్‌కు కాల్ చేయగా సిమ్ డీ- యాక్టివేటెడ్ అని వచ్చింది.కొద్దిసేపటి తర్వాత కస్టమర్ కేర్ నుంచి అతడికి ఫోన్ వచ్చింది. ‘మీ కోరిక మేరకు సిమ్ కార్డ్ బ్లాక్ చేస్తున్నాం…’ అని తెలుపుతూ వచ్చిన ఆ కాల్ చూసి షా కి షాక్ తగిలినంత పనైంది.

తాను ఎలంటి రిక్వెస్ట్ చేయలేదని చెప్పాడు. బ్యాంకుకి వెళ్లి అకౌంట్ చెక్ చేసుకోగా… రూ. కోటి 86 లక్షలు మాయమైనట్టు తేలింది. ఆ డబ్బును 28 ట్రాన్సాక్షన్స్ ద్వారా దేశంలోని 14 ఖాతాలకు పంపినట్టు రిపోర్ట్‌లో తేలింది.సిమ్ కార్డు ద్వారా సమాచారాన్ని సేకరించిన సైబర్ క్రైమ్ నేరగాళ్లు… ఖాతాలో డబ్బు కాజేసినట్టు నిర్ధారించారు సైబర్ క్రైమ్ నిపుణులు.పెరుగుతున్న సైబర్ నేరగాళ్ల సంఖ్య..దీనిని అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన మోసాలు జరుగుతూనే ఉన్నాయి.దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.ఎటువంటి మెసేజెస్,ఓటీపీ అలాంటివి ఎవరైనా అడిగితే చెప్పకండి.లేదంటే మీరు కూడా ఇ నేరగాలకు బలికాక తప్పదు.