Home / 18+ / నెల్లూరులో సోమిరెడ్డి పడిపోవటానికి కారణం అదే.. బీబీసీ తెలుగులో ఎన్టీఆర్ సినిమా గురించి ఏం చెప్పారు.?

నెల్లూరులో సోమిరెడ్డి పడిపోవటానికి కారణం అదే.. బీబీసీ తెలుగులో ఎన్టీఆర్ సినిమా గురించి ఏం చెప్పారు.?

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారట.. నెల్లూరులో సహచర మంత్రి నారాయణతో పాటు ఇతర మిత్రులతో కలిసి తాజాగా రిలీజైన ఎన్టీఆర్ కధానాయకుడు సినిమాకు వెళ్లిన సోమిరెడ్డి కృష్ణుడి వేషంలో బాలయ్యను చూసి విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ డైలాగులను బాలయ్య తన గొంతుతో చెప్తుండడం విని తట్టుకోలేక సోఫాలో పడిపోయారట.. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. కానీ ఇదంతా నెటిజన్లు చేసిన ట్రోల్.. విషయం ఏమిటంటే సినిమా చుస్తున్నంత సేపు ఎవరైనా సరదాగా ఉండాలిగానీ ఆత్రుతగా ఎదురు చూడాలి.. కానీ ఈ వీళ్లు నీరసంగా డీలాపడి కూర్చుండిపోయారు.

ముఖ్యంగా సోమిరెడ్డి అసలు కిమ్మనలేదట.. అయితే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సోమిరెడ్డిపై ట్రోల్స్ మొదలయ్యాయి.. సినిమా రిలీజైనపుడు చాలా ధియేటర్లలో కనీసం టికెట్లు కొనేవారు లేకపోవడంతో ఫ్రీగా పంచిపెట్టారు. ఎన్టీఆర్ ను జీవితకధ చూడాలని అందరికీ ఉన్నా బాలయ్యను ఆపాత్రలో చూడలేక చాలామంది సినిమా చూడడం లేదన్నది చాలామంది చెప్తున్నమాట. మరోవైపు బీబీసీ తెలుగు చానల్ వారే స్వయంగా ఎన్టీఆర్ కృష్ణుడి వేషంలో బాలయ్య అస్సలు సూట్ కాలేదని నిర్మొహమాటంగా చెప్పేసారు.