Home / TELANGANA / వారం రోజులలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలి.

వారం రోజులలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలి.

సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మోడల్ రైతు బజారు, సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులను శుక్రవారం ఉదయం మాజీ మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా పరిశీలనలు జరిపారు. ఇంకె ఎన్ని రోజులలో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అందిస్తారని కాంట్రాక్టరును ఆరా తీశారు. అంతకు ముందు రైతు బజారులోని వినియోగదారులను మార్కెట్ సౌలత్ గా ఉందాని.., కూరగాయల వ్యాపారులను గిట్టుబాటు ధర లభిస్తుందా.. ఆప్యాయంగా పలకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుబజారులో చెత్త చెదారం ఉన్నాయని క్లీన్ గా ఉండేలా చూడాలని రైతు బజారు ఎస్టేట్ అధికారి ప్రభాకర్ పై అగ్రహం వ్యక్తం చేశారు.