గత కొన్ని రోజుల క్రితమే ఏపీ మంత్రి అఖిల ప్రియ ,ఆమె సోదరుడు నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తమ గన్ మెన్లను వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వారు పార్టీ మారుతారన్న ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగుతుంది.అయితే ఈ వార్తలపై ఆమె ఇవాళ స్పందించారు.భూమా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొందరు కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారని అన్నారు ఇలాంటి రూమర్లు తనను చాలా బాధించాయని చెప్పారు.తల్లితండ్రి లేని తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చి తండ్రిలాగ కాపాడారని అన్నారు . అలాంటి మంచి మనిషిని… టీడీపీ పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని అఖిల ప్రియ పేర్కొన్నారు.