Home / NATIONAL / బ్రేకింగ్..ఎంపీ ఎన్నిక‌ల షెడ్యూల్ రెడీ…ప్ర‌క‌ట‌నే లేటు

బ్రేకింగ్..ఎంపీ ఎన్నిక‌ల షెడ్యూల్ రెడీ…ప్ర‌క‌ట‌నే లేటు

పార్ల‌మెంటు ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌కు ముహుర్తం ఖ‌రారైంది. అధికారిక ప్ర‌క‌ట‌నే ఆల‌స్యం అని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. లోక్‌స‌భ ఎన్నిక‌ల తేదీల‌ను మార్చి నెల మొద‌టి వారంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 3వ తేదీన లోక్‌స‌భ ముగియాల్సి ఉంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌తో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచ‌ల్ రాష్ట్రాల‌కు కూడా అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. జ‌మ్మూక‌శ్మీర్‌లో అసెంబ్లీ ర‌ద్దు అయిన కార‌ణంగా.. మ‌రో ఆరు నెల‌ల్లో అక్క‌డ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఈసీ భావిస్తున్న‌ది.

సిక్కీం అసెంబ్లీ మే 27న ముగియ‌నుంది. ఏపీ, ఒడిశా, అరుణాచ‌ల్ అసెంబ్లీలు జూన్ 18, జూన్ 11, జూన్ 1వ తేదీల్లో ముగియాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఎన్ని ద‌శ‌ల్లో, ఎన్ని నెల‌ల్లో ఆ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌న్న కోణంలో ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తు చేస్తుంది. భ‌ద్ర‌త ఎంత వ‌ర‌కు అవ‌స‌ర‌మ‌న్న దానిపై స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు కొన్ని వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. క‌శ్మీర్‌కు ఎక్క‌వ స్థాయిలో భ‌ద్ర‌త అవ‌స‌రం కాబ‌ట్టి, ఆ రాష్ట్ర ఎన్నిక‌ల‌ను లోక్‌స‌భ కంటే ముందే చేప‌ట్టే ఛాన్సుంది.

2004లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఫిబ్ర‌వ‌రి 29న‌ లోక్‌స‌భ తేదీల‌ను ప్ర‌క‌టించింది. నాలుగు ద‌శ‌ల్లో ఆ ఎన్నిక‌లు సాగాయి. ఏప్రిల్ 20 నుంచి మే 10 వ‌ర‌కు ఆ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. ఇక 2009లో మార్చి 2వ తేదీన లోక్‌స‌భ ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టించారు. అయిదు ద‌శ‌ల్లో ఆ ఎన్నిక‌లు సాగాయి. ఏప్రిల్ 16 నుంచి మే 13 వ‌ర‌కు వాటిని నిర్వ‌హించారు. ఇక 2014లో లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను మార్చి 2వ తేదీన ప్ర‌క‌టించారు. అయిదు ద‌శ‌ల్లో వాటిని చేప‌ట్టారు. ఏప్రిల్ 16 నుంచి మే 13 వ‌ర‌కు ఆ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో తాజా, ప్ర‌క‌ట‌న‌పై ఆస‌క్తి నెల‌కొంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat