Home / POLITICS / రైతు ప్రతినిధే సభాపతి..!!

రైతు ప్రతినిధే సభాపతి..!!

తెలంగాణ ఉద్యమ సారథి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే..తెలంగాణ రైతు బిడ్డ సభాపతిగా చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారని తెలంగాణ శాసనసభ ముక్తకంఠంతో కొనియాడింది. తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ సభాపతిగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని సిఎం కేసీఆర్ ప్రతిపాదించిన నేపథ్యంలో అన్నిపార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో స్పీకర్ ఎన్నిక శుక్రవారం నాడు ఏకగ్రీవం అయింది. తాత్కాలిక స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించిన ముంతాజ్ అహ్మద్ ఖాన్, సభాపతిగా పోచారం ఎన్నికను అధికారికంగా ప్రకటించినారు.విపక్షనాయకులు తోడురాగా.. సభానాయకుడు సిఎం కేసీఆర్ పోచారం శ్రీనివాసరెడ్డిని సభావేదిక మీదికి తోడ్కొని పోయినారు. అనంతరం.. తెలంగాణ రెండవ శాసనసభకు పూర్తికాలపు స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన పోచారం శ్రీనివాసరెడ్డిని సభ ముక్త కంఠంతో అభినందించింది. పోచారం రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నది. డిసిసిబి చైర్మన్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగానే కాకుండా, వివిధ శాఖలకు మంత్రిగా అతను నిర్వర్తించిన బాధ్యతలను గుర్తుచేస్తూ అధికార విపక్ష సభ్యులు ప్రసంగిస్తూ అభినందనలు ప్రకటించారు. తెలంగాణ మొదటి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పోచారం శ్రీనివాసరెడ్డి నిర్వర్తించిన సేవలను సభ్యులు వేనోల్ల కొనియాడారు. నిత్య విద్యార్థిగా తన పనిని మెరుగు పరుచుకుంటూ తెలంగాణ వ్యవసాయ రంగం అభివృద్దికి పోచారం చేసిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు సహకరించిన కాంగ్రేస్, తదితర విపక్షాలకు కృతజ్జతలు తెలిపినారు. సింగిల్ విండో నుంచి ఆరుసార్లు శాసన సభ్యునిగా పలు పోర్టుపోలియోలకు మంత్రిగా పోచారం రాజకీయ ప్రస్థానం సాగిందని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానం కూడా సింగిల్ విండో నుంచే ప్రారంభమైందని ఈ సందర్భంగా సిఎం గుర్తుచేసుకున్నారు. పోచారం తన ఇంటిపేరుకాకున్నా, తన వూరి పేరునే ఇంటిపేరుగా సమాజం పిలుచుకుంటున్నదని., ఇంతటి ఉన్నతస్థితికి చేరుకున్న తమ నాయకున్ని చూసి పోచారం గ్రామం గర్వపడుతున్నదని సిఎం అన్నారు. వ్యవసాయ శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కాలంలో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న అనేక పథకాలు ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందినాయన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న రైతుబంధు, రైతు భీమా వంటి రైతు సంక్షేమ పథకాలు ఇవాల దేశానికే ఆదర్శంగా నిలిచినాయన్నారు. దండుగ అన్న తెలంగాణ వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దిన ప్రభుత్వ కృషిలో పోచారం పాత్ర మరువలేనిదని సిఎం అన్నారు. తెలంగాణ రైతును లక్ష్మీపుత్రులను చేసేందుకు చేపట్టిన కార్యాచరణ ఇప్పటికే మంచి ఫలితాలు రాబట్టాయని, ఇంకా అద్భుతమైన ఫలితాలు తెలంగాణ వ్యవసాయ రంగంలో రాబోతున్నాయన్నారు.
1969 ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారునిగా, విద్యార్ధి దశలోనే ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో పోరాటాలు చేసిన ఘనత పోచారం ది అని సిఎం అన్నారు.నిజాం సాగర్ ఆయకట్టులో వందల ఎకరాలున్నా నీటికరువుతో ఆయకట్టుతో పాటు భూములను పోగొట్టుకున్న కుటుంబం పోచారం శ్రీనివాసరెడ్డిదన్నారు. నేటికీ ఉమ్మడి కుటుంబానికి పెద్దగా పోచారం కొనసాగుతుండడం గొప్పవిషయని చెప్పిన సిఎం., అసెంబ్లీని కూడా తన ఉమ్మడికుటుంబంగా భావించి నడిపిచాలని కోరారు. వ్యవసాయ శాఖకు వొక మంచి మంత్రిని కోల్పోయినామని,అయినా తన కార్యాచరణను మరింత గుణాత్మకంగా కొనసాగించే విధంగా మరో సమర్థునికి బాధ్యతలు అప్పగించనున్నట్టు సిఎం తెలిపారు.
ఈ సంధర్భంగా పలువురు సభ్యులు సభాపతికి అభినందనలు తెలిపారు.
కాంగ్రేస్ పార్టీకి చెందిన సభ్యుడు గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ..ఎంత పెద్ద పదవి వున్నా ఒదిగి వుండే స్వభావం పోచారం ది అన్నారు. తెలంగాణ వ్యవసాయాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీయార్ చేస్తున్న కృషిని మంత్రిగా పోచారం ముందుకు తీసుకుపోయాడని, హోంశాఖ మంత్రి మహమూదలి అన్నారు. గత సమావేశాల్లో వ్యవసాయం మీద చర్చ సందర్భంగా పోచారం ఇచ్చిన సుధీర్ఘ సమాధానాన్నిగుర్తు చేసిన కేటియార్, వ్యవసాయ శాఖ మీద నూతన సభాపతికి వున్న పట్టు, రైతుల బాగుపడేదాని మీదున్న పట్టుదలను గుర్తుచేశారు. వ్యవసాయశాఖ మంత్రిగా పోచారం ఆర్థిక శాఖ మంత్రిగా తాను రైతు సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలను, కలిసిపనిచేసిన విధానాన్ని మాజీ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తన ప్రసంగం సందర్భంగా గుర్తు చేసుకున్నారు. శారీరక సమస్యలను లెక్క చేయకుండా, 69 ఏండ్ల వయస్సులో 29 ఏండ్ల యువకుడిలా పోచారం పనిచేసిన తీరును మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడినారు. తన తండ్రితో పోచారానికున్న అనుబంధాన్ని గుర్తుచేసిన కాంగ్రేస్ పార్టీ సభ్యుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు అధికార ప్రతిపక్షాలను వొకే రీతిన చూడాలని కోరినారు.
రైతే రాజు అన్నట్టుగా., రైతు స్వయంగా వచ్చి స్పీకర్ కుర్చీలో కూర్చున్న తీరుగా స్పీకర్ స్థానం కనిపిస్తున్నదని సభ్యుడు గ్యాదరి కిశోర్ కుమార్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హుందాతనాన్ని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ కారుడు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రైతు బిడ్డే స్పీకర్ అయిండని గంగుల కమలాకర్ అభిప్రాయపడినారు. తెలంగాణకు అనుకూలంగా మాట్లాడితే తన తొడమీద విచక్షణారహితంగా చరిచిన చంద్రబాబు వంటి వారి చెంప చెల్లుమనిపించేలా నేడు అదే అసెంబ్లీకి సభాపతిగా పోచారం శ్రీనివాస రెడ్డిని సిఎం కేసీయార్ ఎంపికచేయడం పట్ల సభ్యుడు పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేసినారు.ఇది రైతు ప్రతినిధికి దక్కిన గౌరవమని ఆయన అన్నారు. నాకు ఎర్రజొన్నల జీవన్ రెడ్డిగా పేరు రావడానికి వ్యవసాయ మంత్రిగా పోచారం చేసిన కృషి ఉందని సభ్యుడు జీవన్ రెడ్డి అన్నారు. పోచారంతో పోటాపోటీగా తన రాజకీయ జీవితం సాగిందని సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. ఆదర్శ రైతును స్పీకర్ కుర్చీలో కూర్చుండబెట్టినట్టుగా ఉందని ఎర్రబెల్లి దయాకార్ రావు అన్నారు. నూతన కాంగ్రేస్ సభ్యుడు జాజుల సురేందర్ మాట్లాడుతూ తనకు రాజకీయ స్పూర్తిగా కొనియాడగా,తన రాజకీయ గురువు పోచారం అని హన్మంత్ షిండే తెలిపారు. గంప గోవర్దన్, గణేశ్ గుప్తా, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస యాదవ్, నోముల నర్సిమ్మయ్య, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, పద్మా దేవేందర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, డిఎస్ రెడ్యా నాయక్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తదితర సభ్యులు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన పోచారం శ్రీనివాస రెడ్డిని కొనియాడుతూ అభినందనలు తెలిపారు.
సభకు సమాజానికి వారధిగా తాను గురుతర బాధ్యతలను నిర్వర్తిస్తానని సభా మర్యాదలను మరింతగా ఇనుమడింప చేస్తానని,తనమీద విశ్వాసంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నిర్వర్దిస్తానని తెలిపిన సభాపతి పోచారం.,ముఖ్యమంత్రికి తన కృతజ్జతలు తెలిపినారు. సభను శనివారం నాటికి వాయిదా వేసినారు.

సోర్స్ : Ramesh Hazari

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat