Home / ANDHRAPRADESH / టీడీపీ పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గుడ్ బై..!

టీడీపీ పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గుడ్ బై..!

ఏపీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి దిమ్మతిరిగే షాకిచ్చే పనిలో ఉన్నాడు ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగిన సండ్ర వెంకటవీరయ్య ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున బరిలోకి దిగిన పిడమర్తి రవిపై సుమారు ముప్పై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే మహాకూటమి అధికారంలోకి వస్తే చక్రం తిప్పుదామని ఎన్నో కలలు కన్న చంద్రబాబు కలలను తిప్పికొడుతూ తెలంగాణ ప్రజలు ఉద్యమ పార్టీ ,ఇంటి పార్టీ అయిన టీఆర్ఎస్ కే తిరిగి పట్టం కట్టారు.

టీడీపీ తరపున బరిలోకి దిగినవారిలో అశ్వారరావుపేట,సత్తుపల్లి అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. తాజాగా సత్తుపల్లి అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సండ్ర టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే నిన్న గురువారం జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజరు కాలేదు. అంతే కాకుండా ఈ రోజు శుక్రవారం టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుక ఏర్పాట్లను సత్తుపల్లిలో సిద్ధం చేసిన కానీ వాటన్నీటిని పక్కన పెట్టేసి రాత్రికి రాత్రే హైదరాబాద్ బయలు దేరారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా సండ్ర టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమంటున్నారు రాజకీయ వర్గాలు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat