Home / ANDHRAPRADESH / అన్నా క్యాంటీన్లు సక్రమంగా లేక సొంత నిధులతో అన్నం పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

అన్నా క్యాంటీన్లు సక్రమంగా లేక సొంత నిధులతో అన్నం పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

పేద‌ల ఆక‌లి తీర్చాల‌న్న భావ‌న‌తో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు సొంత నిధుల‌తో రూ.5ల‌కే భోజ‌నం ప‌థ‌కాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. మొద‌ట వైయ‌స్ఆర్‌సీపీ మంగళగికి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజ‌న్న క్యాంటీన్ ఏర్పాటు చేయ‌గా ఆ త‌రువాత హిందూపురం, న‌గ‌రి, రైల్వే కోడూరులో రాజ‌న్న క్యాంటీన్ ఏర్పాటు చేసారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హడావుడి చేయటం తప్ప ఎక్కడా సక్రమంగా అన్నా క్యాంటీన్లు నడపడం లేదు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా నడుం బిగిస్తున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేదలకు ఈ పధకం ప్రారంభించారు. అలాగే ఆకలితో ఎవరూ ఉండకూదన్న ఉద్దేశంతో నాలుగు రూపాయలకే భోజనం పేరుతో వైఎస్ఆర్ క్యాంటీన్ వంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రోజా.. సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్ కే రోజా తన పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ నిధులతో ప్రతిరోజు రూపాయలు 4కే భోజనం అందించేలా వైయస్సార్ క్యాంటీన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అలాగే వైసీపీకి చెందిన మంగళగికి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన రాజన్న క్యాంటీన్ చాలా నెలల క్రితం నుండి కొనసాగుతోంది. ఈ క్యాంటీన్ లో ప్రతిరోజు మధ్యాహ్నం నిరుపేదల ఆకలి తీర్చేందుకు కేవలం 4 రూపాయలకే నాణ్యమైన భోజనం పెడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ఠీఆర్ క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హడావుడి చేయటం తప్ప రాజధాని గ్రామాల్లో అనుకున్న ప్రాంతాల్లో ఇంత వరకు క్యాంటీన్లను ఏర్పాటు చేయలేదని గతంలో ఆళ్ళ విమర్శించారు. నాలుగు రూపాయలకే అందిస్తున్న రాజన్న క్యాంటీన్ లో మెనూ ఒక కప్పు సాంబార్ రైస్, ఓ కప్పు పెరుగన్నం, కోడిగ్రుడ్డు, ఒక అరటి పండు, వడియాలు వాటర్ ప్యాకెట్ అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ వైసీపీ రాజన్న క్యాంటీన్లు మరింతకాలం సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat