Home / BHAKTHI / రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని..సహస్ర చండీ మహాయాగం..!!

రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని..సహస్ర చండీ మహాయాగం..!!

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో 5 రోజుల పాటు నిర్వహించే శ్రీ సహస్ర మహా చండీయాగం సోమవారం ఉదయం వేద మంత్రోఛ్చారణల మధ్య ప్రారంభమైంది. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో, జగద్గురు శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి దంపతులు వివిధ రకాల పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శుద్ధి పుణ్య హవచనం , ఋత్విక్ వర్ణం , చతుర్వేద పారాయణం , యాగశాల ప్రదక్షిణ , గోపూజ, గురుపూజ, నవగ్రహ పూజ నిర్వహించి రాజశ్యామల యాగం ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు , సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగాలని , రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని , ప్రజలు క్షేమంగా ఉండాలని , సమృద్ధిగా వర్షాలు కురవాలని వ్యవసాయం సుభిక్షంగా ఉండాలని ఋత్వికులు పూజలు చేశారు . రాష్ట్రంతో పాటు దేశం సుభిక్షంగా ఉండాలని , దేశ పౌరులకు సుపరిపాలన అందాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 300 మందికి పైగా ఋత్వికుల ఆధ్వర్యంలో యాగం అత్యంత సాంప్రదాయబద్దంగా జరుగుతున్నది .

Image may contain: 2 people, people sitting

Image may contain: night, sky and outdoor

Image may contain: one or more people, people standing and fire

Image may contain: 2 people, people standing and outdoor

Image may contain: 3 people, people standing

Image may contain: one or more people

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat