తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ కాపీ కొడుతున్నారు. తాజాగా ఆపార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా ఇదేవిధంగా విమర్శించారు. పరీక్షల్లో కాపీ కొట్టిన విద్యార్థిని డిబార్ చేస్తారని, అలాగే తమ పార్టీ మేనిఫెస్టోను కాపీ కొట్టిన చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రానికి ఎక్స్ పైర్ అయిన టాబ్లెట్ వంటి వారని, వైయస్ జగన్ అప్డేటెట్ వర్షన్ అయితే చంద్రబాబు ఔట్ డేటెడ్ వర్షన్ అని రోజా ఎద్దేవా చేశారు. బాబు వస్తే జాబు వస్తుందన్న చంద్రబాబు తనకొడుక్కి మాత్రం మంత్రి పదవి ఇప్పించారని, ఇంకెవరికీ ఉద్యోగాలు లేవన్నారు.
చంద్రబాబు పెంచిన పెన్షన్ 2 నెలలు మాత్రమే ఇస్తాడన్నారు. వైయస్ జగన్కు ఓటేస్తే జీవితాంతం ఇస్తారని తెలిపారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పుడు చంద్రబాబు అందరికీ తోచిన హామీలిస్తున్నారని అవి ఎట్టి పరిస్థితుల్లో నెరవేరవన్నారు. వైఎస్సార్సీపీ ఇస్తున్న ప్రతీ హామీని కాపీ కొడుతూ చంద్రబాబు తన బుద్దిని మరోసారి బయటపెట్టుకున్నారంటూ వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు.