Home / 18+ / జగన్ ఎంతో ధైర్యవంతుడు.. శ్రీకాకుళంలో అలా చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి

జగన్ ఎంతో ధైర్యవంతుడు.. శ్రీకాకుళంలో అలా చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి

శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో వైఎస్ అభిమానుల సమక్షంలో యాత్ర ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారుఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. ఎవరైనా సినిమా తీస్తే కష్టపడ్డానంటారు.. నేను సుఖంగా సినిమా తీశా స్క్రిప్ట్ అనేది బుక్‌లోనే ఉంటుంది. అది స్క్రీన్ మీదికి రావాలి అంటే సరైన ప్రొడ్యుసర్ దొరకాలి. అలాంటి నిర్మాత ఈ సినిమాకి పనిచేశారన్నారు. జగన్మోహన్ రెడ్డిగారితో తనకు జరిగిన సంఘటనలను వివరించారు దర్శకుడు.. జగన్ గురించి ఏమన్నాడో ఆయన మాటల్లోనే.. ఇక జగన్ గారి గురించి ఒకటి చెప్పాలి.. ఈ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు జగన్ అన్న పర్మిషన్ తీసుకోలేదు. వైస్ పాదయాత్ర గురించే కదా అడగాల్సిన అవసరం లేదు అనుకున్నా.. స్క్రిప్ట్ రాసేశా. ఈ సినిమా పోస్టర్ చూపించడానికి జగన్ అన్నదగ్గరకి వెళ్లి కలిసారు.. ఆయన ఒక్కటే మాట అన్నారు. మా నాయన జనానికి ఏం చేశారో చూపించు. అంతేతప్ప చేయని వాటి గురించి చెప్పొద్దు అన్నారు.

 

సినిమా షూటింగ్ అయిపోయిన తరువాత ట్రైలర్ చూపిద్దాం అని శ్రీకాకుళం వెళ్లి కలిసాను.. జగన్ అన్న ట్రైలర్ చూసి బావుందన్నారు. సినిమా చూస్తారా అన్నా అని అడిగా దానికి ఆయన చెప్పిన సమాధానం విని షాకయ్యానన్నారు. ‘మీ నాయకుడి గురించి మీరు చెప్పాక.. ఇక నన్నేం చేయమంటారు చూడాల్సిన అవసరం లేదులే’ అన్నారు. మా నాన్న కథ అనలే.. మీ నాయకుడు కథ.. నువ చెప్పిన కథ అన్నారు.. అలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం జగన్‌లో చాలా ఉంది. ఈ ఈవెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవర్నైనా ముఖ్య అతిథిని పిలుద్దాం అనుకున్నప్పుడు ఎవరో ఎందుకు వైఎస్ అభిమానుల్నే పిలుద్దాం అనుకున్నాను. ఈ సినిమా బాగుంటుందా లేదా అన్నది తరువాత విషయం. బాగుంటేనే మా సినిమా చూడండి. ఎవరైనా సినిమా చూసొచ్చి బాగుంది అంటేనే వెళ్లి చూడండి. ఈ చిత్రంలో నటించిన మమ్ముట్టి సార్‌‌ని చూసి చాలా నేర్చుకున్నా అంటూ ఉద్వేగంగా మాట్లాడారు దర్శకుడు మహి వి రాఘవ.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat