Home / CRIME / 13ఏళ్ల అమ్మాయి.. వీడియో చాటింగ్‌లు..లోదుస్తులతో ఉన్న ఫొటోలు

13ఏళ్ల అమ్మాయి.. వీడియో చాటింగ్‌లు..లోదుస్తులతో ఉన్న ఫొటోలు

దక్షిణ ఆక్లాండ్ టెక్సాస్లోని ఆన్ లైన్ అక్రమ సంబంధం బట్టబయలైయ్యింది. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో 13ఏళ్లు అమ్మాయి అక్రమ సంబంధం. ఏడాది క్రితం ఆమెకు ఇన్‌స్టాగ్రాంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతని పేరు గేవిన్ గైల్స్. న్యూజిలాండ్‌కు చెందినవాడు. అతను 46 సంవత్సరాలు పైగా పోలీసు. మొదట్లో మామూలుగానే మాటలు కలిపిన అతను సమయం గడిచేకొద్దీ ఆమెను నెమ్మదిగా తప్పుదారి పట్టించాడు. ఆమె వయసు, ఇతర వివరాలు కూడా తెలుసుకున్నాడు. అవి కూడా అతనిలోని కామపిశాచికి అడ్డు కాలేదు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా, ఆమెకు అసభ్యకరం సందేశాలు పంపడం మొదలెట్టాడు. వీడియో చాటింగ్‌లు చేసి లోదుస్తులతో ఉన్న ఫొటోలు పంపాలని కోరాడు. ఆమెకు 18ఏళ్లు రాగానే న్యూజిలాండ్‌కు తీసుకువస్తానని, ఆ తర్వాత ఇద్దరమూ కలిసే ఉండవచ్చని మాయమాటలు చెప్పాడు. ఆమెను ప్రేమిస్తున్నానన్నాడు. ఆ మాటలు నమ్మిన ఆమె అతను చెప్పిందల్లా చేసింది. అతను చెప్పాడని నగ్నంగా ఉన్న ఫోటోలు కూడా పంపింది. అలా ఏడాది తిరిగేసరికి ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అమాయకురాలైన అమ్మాయి కాస్తా.. చాలా మంది మగాళ్లతో ఆన్‌లైన్‌లో ఇటువంటి సంబంధాలు పెట్టుకుంది. ఇదంతా గేవిన్ ఇచ్చిన ట్రైనింగే. ఆ అమ్మాయి ఇలా చేస్తుందని తెలుసుకున్న టెక్సాస్ పోలీసులు.. ఆ అమ్మాయి సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించగా, గైల్స్ వివరాలు కూడా తెలిసాయి. దాంతో అతనిపై కేసు పెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. అమ్మాయి మైనరని తెలిసీ అసభ్య సందేశాలు, చిత్రాలు పంపిన గైల్స్‌కు ఆక్లాండ్ డిస్ట్రిక్ట్ కోర్టులోని న్యాయమూర్తి డేవిడ్ షార్ప్ 8 నెలల గృహనిర్భందం విధించాడు.