Home / 18+ / ఆదిత్యానాధ్ సహా పలువురిపై కేసులు కొట్టివేసిన కోర్ట్.. ధర్మ విజేతగా జగన్

ఆదిత్యానాధ్ సహా పలువురిపై కేసులు కొట్టివేసిన కోర్ట్.. ధర్మ విజేతగా జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులో ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్‌కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో సోమవారం ఊరట లభించింది. ఆదిత్యనాథ్ పైన సీబీఐ మోపిన అభియోగాలని కొట్టి వేసింది. ఆదిత్యనాథ్‌ను సీబీఐ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. ఆదిత్యానాథ్ 2004-2009 మధ్య కాలంలో ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నారు. ఈయన ఇండియా సిమెంట్‌కు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ అభియోగాలు ఉన్నాయి.

గత కొన్నాళ్లుగా జగన్ ఆస్తుల కేసులు వరుసగా వీగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ ఆస్తుల కేసులో అధికారులకు ఊరటపై అధికార తెలుగుదేశం ఉలిక్కి పడుతోంది. గతంలో కూడా పెట్టిన పలువురు అధికారుల కేసులను కూడా కోర్టు కొట్టివేసిన విషయం తెలిసింది. తాజాగా ఆదిత్యానాధ్ విషయంలో ప్రాసిక్యూషన్ కు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించిన నేపధ్యంలో కేసుకు కొట్టివేస్తున్నట్టు తెలిపారు. ప్రాసిక్యూషన్ కు ముందస్తు అనుమతి లేకుండా సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకోవడాన్ని తప్పబట్టారు. నీటి కేటాయింపులు సక్రమంగా జరిగాయంటూ అప్పట్లో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య సుప్రీంలో దాఖలు చేసిన అఫిడవిట్ ను తీర్పులో ప్రస్తావించారు.

అసలు ఇండిమా సిమెంట్స్ కు కృష్ణా, కాగ్నా నదుల నీటి కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినందున జగన్ కంపెనీల్లో ఇండియా సిమెంట్స్ పెట్టుబడులు పెట్టిందనేది అసలు ఆరోపణ.. కానీ చివరిగా సుదీర్ఘ విచారణలో ఆదిత్యానాధ్ తపరున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ విధి నిర్వహణలో భాగంగా నీటికేటాయింపులు న్యాయబద్ధంగా జరిగాయంటూ వాదనలు వినించడం పట్ల కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. దీనితో పాటు గతంలో జగన్ పై పెట్టిన అనేక అక్రమాస్తుల కేసులను న్యాయస్థానం విచారణ జరిపి కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తమ నాయకుడు కడిగిన ముత్యంలా కేసుల నుండి బయటకు వస్తారని ధర్మవిజేతగా నిలుస్తాడని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat