Home / 18+ / తొణకలేదు.. చంద్రబాబులా శోకాలు పెట్టలేదు.. చరిత్ర సృష్టించబోతున్నాడు

తొణకలేదు.. చంద్రబాబులా శోకాలు పెట్టలేదు.. చరిత్ర సృష్టించబోతున్నాడు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పూర్తిచేసి దేశ రాజకీయాల్లోనే ఓ చరిత్రను లిఖించారు. అంతులేని జనాభిమానం సంపాదించుకుని జయహో అనిపించుకున్నాడు. అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను దాటారు.. ముఖ్యంగా జగన్ ఏడాదికాలంగా ప్రకటిస్తున్న హామీలను అచ్చుగుద్దినట్టు చంద్రబాబు కాపీ కొడుతున్నారు. అయినా జగన్ తొణకట్లేదు.. టీడీపీ వ్యతిరేక ఓట్లను మాయం చేసి, అనుకూల ఓట్లను రెండేసి సార్లు చేర్చుకుంటూ నీచరాజకీయం చేస్తున్నాజగన్ చంద్రబాబులా శోకాలు పెట్టలేదు. ఎక్కడా దొడ్డిదారులు తొక్కలేదు.. సాకులు చెప్పలేదు.. కాలయాపన చేయలేదు.

సర్వేల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జరగుతున్న ఓట్ల గల్లంతుపై జగన్ ఎన్నోసార్లు బహిరంగంగా నిరసన తెలియచేసారు. ఇప్పుడు ఆధారాలతో నేరుగా ఎన్నికల కమీషన్ ముందుకెళ్లి నిలబడ్డారు. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు అందించారు. ఈవీఎమ్ లతో దొంగ ఓట్లు వేయడం సాధ్యం కాదు కనుక, బ్యాలెట్ కావాలంటూ కుంటిసాకులు చెబుతున్నారని, కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో గెలిచింది ఈవీఎమ్ ల టాంపరింగ్ వల్లేనా అని లాజిక్ లేకుండా మాట్లాడే ముఖ్యమంత్రి ని సూటిగా ప్రశ్నించారు. పాదయాత్రలో ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నంపై కూడా జగన్ ఎంతో హుందాగా స్పందించారు. ఎక్కడా అల్లర్లు జరక్కుండా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.

ఆందోళనలకు తావివ్వకుండా, ఘటనా స్థలంనుంచి దూరంగా హైదరాబాద్ వెళ్లిపోయారు. ప్రభుత్వం హత్యాయత్నం కేసును నీరుగారుస్తుందని అర్థం కాగానే నేరుగా కేంద్రాన్ని సంప్రదించారు. తనపై జరగుతున్న కుట్రలో సూత్రధారులెవ్వరో కనిపెట్టాలని విచారణ జరిపించాలని కోరారు. హత్యాయత్నం చేసింది అభిమానే అంటూ కేసును తప్పుదోవ పట్టిస్తూ, హత్యాయత్నం జగన్ కుటుంబ సభ్యులే చేసారని ప్రచారం చేస్తూ వచ్చిన చంద్రబాబుకు, జగన్ చర్య పెద్ద ఎదురుదెబ్బలా తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఎ రంగంలోకి దిగడంతో చెమటలు పట్టిన టిడిపి ప్రభుత్వం విచారణకు వీల్లేదంటూ కోర్టుకు పరుగెత్తింది. తనపై అన్యాయంగా పెట్టిన కేసులపై ఇన్నేళ్లుగా జగన్ తన నిజాయితీని న్యాయస్థానం ద్వారానే నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్నారు. తనపై వచ్చిన ప్రతి ఆరోపణనూ న్యాయపరంగానే ఎదుర్కుంటున్నారు.

 

అంతేతప్ప తనను మరెవరో కాపాడాలని కోరుకోలేదు. దర్యాప్తు సంస్థలు దగ్గరకే రాకూడదని బాబులాగా వీరంగం వేయలేదు. స్టేలు తెచ్చుకోలేదు. తనపై వచ్చిన ప్రతి ఆరోపణనూ ధైర్యంగా ఎదుర్కుంటున్నారు.. న్యాయపరంగా గెలిచి తానేంటో నిరూపించుకోవాలనే కోవలోనే వెళుతున్నారు జగన్. జగన్ కు చట్టం అంటే గౌరవం, న్యాయస్థానంపై నమ్మకం, ధర్మం తప్పని నడత, ఆశయం వీడని సంకల్పం, పోరాటం వీడని వ్యక్తిత్వం,ప్రజలే అన్నీ అనే ధైర్యం, తండ్రి ఆశీస్సులు ఉంటాయని నమ్మకం అందుకే జగనే ఒక విజన్.. అతడి తీరే ఓ విజన్.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat