Home / CRIME / అరాచకం..అమ్మాయిని మరో అమ్మాయి రేప్

అరాచకం..అమ్మాయిని మరో అమ్మాయి రేప్

దేశ వ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులు అత్య్తంత దారుణంగా జరుగుతున్నాయి. నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వచ్చిన కర్కశ కామాంధుల కాటు నుండి మాత్రం ఆడవారు తప్పించుకోలేక పోతున్నారు. ప్రతి రోజు ఎక్కడ ఒక్క చోట అమ్మాయిని రేప్ చేసిన వార్త వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక అమ్మాయి మరోక అమ్మాయిను రేప్ చేసిన ఘటన ఢిల్లీలో తీవ్ర కలకలం సృష్టించింది. అసలు ఓ మహిళ మరో మహిళను ఎలా రేప్ చేస్తుంది. అది ఎలా సాధ్యం అంటారా…అసలేం జరిగిందంటే ఢిల్లీలోని దిల్షాద్ కాలనీలో నివాసం ఉంటే రోహిత్‌ అతని స్నేహితులు నగరానికి కొత్తగా వచ్చే వారిని ఎంచుకుని వారిపై అత్యాచారాలు చేయడంలో ఆరి తేరారు. అలా నగరానికి వ్యాపారం కోసం వచ్చిన ఓ అమ్మాయిని వారు మాటలతో బురిడీ కొట్టించారు. వ్యాపారంలో పెట్టుబడి పెడతామని నమ్మించారు. అమాయకంగా వారిని నమ్మి వారి ఆఫీస్ కు బాధితురాలు వెళ్లింది. అక్కడ రోహిత్ తో పాటు అతని స్నేహితులు బాధితురాలిపై అత్యాచారం చేశారు. అంతే కాకుండా ఆ బాగోతాన్ని వీడియో తీశారు. దాన్ని ఆయుధంగా వాడుకుని చాలాసార్లు రేప్ చేశారు. ఇంకో దారుణం ఏమిటంటే రోహిత్ ఫ్రెండ్ సర్కిల్లోని ఓ అమ్మాయి కూడా బాధితురాలిపై అత్యాచారం చేసింది. నడుముకు మగవారి అంగాన్ని పోలిన సెక్స్ టాయ్ కట్టుకుని బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టింది. మొత్తం మీద ఆ నరకం నుంచి ఎలాగో బయటపడిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి అరాచకం వెలుగుచూసింది.