Home / ANDHRAPRADESH / కెసీఆర్ అన్నా మోదీ అన్నాచంద్రబాబుకు వణుకు..!!

కెసీఆర్ అన్నా మోదీ అన్నాచంద్రబాబుకు వణుకు..!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు.

హోదా విషయంలో బిజెపి, కాంగ్రెస్ లు రెండూ ద్రోహం చేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ మొదటి నుంచి చెబ్తోంది. చంద్రబాబే ప్యాకేజి ముద్దు అన్నాడు. యూటర్న్ తీసుకుని ఇప్పుడు హోదా కావాలంటున్నాడు. దళారీ వ్యవహారాలకు అలవాటు పడిన బాబుకు ఇతరుల నిజాయితీని శంకించడం అలవాటే!”అని అన్నారు.

తెలంగాణా ఎన్నికల్లో ఓడి పోవడానికి కూడా వైఎస్సార్ కాంగ్రెస్సే కారణమంటాడు. ఈయనకు కెసీఆర్ అన్నా మోదీ అన్నా వణుకు. అదిగో నాలాగా వాళ్లకు చెమటలు పట్టడం లేదు కాబట్టి అంతా కలిసి పోయారని గుండెలు బాదుకుంటాడు. ఫోబియాల నుంచి బయటపడండి చంద్రబాబు గారూ!“అంటూ విమర్శించారు.

ప్యాకేజీ కోసం హోదాను తాకట్టుపెట్టిన ప్రజా ద్రోహి చంద్రబాబు. యూటర్న్ తీసుకుని హోదా రాగం ఎత్తుకున్నా ప్యాకేజీ ఒప్పందాన్ని రద్దు చేయమని కేంద్రాన్ని కోరలేదు. ప్యాకేజీ ద్వారా వచ్చే నిధుల కోసం చాటుగా ఢిల్లీని దేబిరిస్తూనే మరోపక్క దొంగ దీక్షలు చేస్తున్నారు. రెండు కళ్ళ సిద్ధాంతం కదా మరి!“అంటూ ఎద్దేవా చేశారు.

వరాల జల్లు కురిపిస్తున్నా జనంలో ఎదురుగాలి చూసి బాబుతో సహా మంత్రులకు మతి తప్పుతోంది. మనం ఇస్తున్నవన్నీ తీసుకుంటూ మనకే వ్యతిరేకంగా మాట్లాడతారా అంటూ జనం మధ్య ఒక మంత్రి బూతు పురాణం విప్పితే, మీ ఇష్టప్రకారం ఓట్లేస్తే కుదరదు అని ఇప్పుడు చంద్రబాబు జనాన్ని బెదిరిస్తున్నారు.”” సీఎం అయిన రోజు నుంచే పసుపును నల్లరంగుగా మార్చేశారు బాబు. ఫించన్లు, ఇళ్ళు, ఇళ్ళ పట్టాలకు రేట్‌ కార్డు పెట్టి ఎల్లో సేనలు జనాన్ని కొల్లగొడితే, ప్రాజెక్ట్‌లు, కాంట్రాక్ట్‌ల్లో బాబు వేల కోట్లు దోచి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. బాబు పాలన రాష్ట్ర చరిత్రలో ఓ చీకటి అధ్యాయం.”అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat