Home / BUSINESS / కేటీఆర్‌ తో భేటీ అయిన కెనడా కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్‌

కేటీఆర్‌ తో భేటీ అయిన కెనడా కాన్సుల్ జనరల్ నికోల్ గిరార్డ్‌

కెనడా కాన్సులేట్‌ జనరల్ నికోల్ గిరార్డ్‌ టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తో  భేటీ అయ్యారు.ఇవాళ బేగంపేట కేటీఆర్‌ కార్యలయంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర సంవత్సరాలుగా అనేక రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందని.. కెనడా కాన్సులేట్‌ జనరల్ నికోల్ గిరార్డ్‌  ప్రశంసించారు. అంతేకాకుండా తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి .. టీఆరెస్‌  తిరిగి అధికారంలోకి వచ్చినందుకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.

వాణిజ్య పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలను నికోల్ గిరార్డ్.. ప్రత్యేకంగా  అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ రంగ పథకాలు, కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి తో పాటు వ్యవసాయ రంగ ప్రగతి కోసం కూడా వినూత్నమైన ప్రణాళికలను,  పథకాలను కోనసాగిస్తున్నామన్నారు.కెనడా పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం సాదర స్వాగతం పలుకుతున్నదని కేటీఆర్ తెలిపారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat