Breaking News
Home / ANDHRAPRADESH / బాబు మ‌రో కాపీ..తెలంగాణ ప‌థ‌కం య‌థాత‌థంగా అమ‌లు

బాబు మ‌రో కాపీ..తెలంగాణ ప‌థ‌కం య‌థాత‌థంగా అమ‌లు

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు తెలంగాణ‌ను కాపీ కొట్టేశారు. ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌లో భాగంగా, ఆయ‌న త‌న విధానాన్ని త‌నే మార్చేశారు. అది కూడా స్వ‌ల్ప‌కాలంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం ఇటీవల కేంద్రం 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు 3 విడతలుగా రూ. 6వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని తెలిపింది. కేంద్రం ఇస్తున్న రూ. 6వేలతో పాటు మరో రూ. 4వేలను రైతులకు అదనంగా ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. అదే విధంగా కేంద్ర పథకానికి అర్హులు కాని రైతులకు రూ. 10వేలు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చెల్లించనుంది.

అయితే, తాజాగా ఈ రూల్స్ మార్చేసింది.  తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా, రాష్ట్రంలో ఐదు ఎకరాల పొలం ఉన్న ప్రతి కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం ఇవ్వాల‌ని డిసైడ్ చేశారు. గతంలో కేంద్రం ఇచ్చే 6వేలకు అదనంగా నాలుగు వేలు ప్రభుత్వం ఇవ్వనుంద‌ని తెలిపారు. కేంద్రం ఇచ్చే ఆరు వేలకు అదనంగా 10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వమే 16వేలు చెల్లించాలని నిర్ణయించింద‌ని ప్ర‌క‌టించారు.