Breaking News
Home / ANDHRAPRADESH / పాక్ ప‌త్రిక‌లో ప‌వ‌న్ మాట‌లు…జ‌న‌సేన సంచ‌ల‌నం

పాక్ ప‌త్రిక‌లో ప‌వ‌న్ మాట‌లు…జ‌న‌సేన సంచ‌ల‌నం

జ‌న‌సేన అధ్య‌క్షుడు సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి పాకిస్థాన్ ప‌త్రిక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. యుద్ధం వస్తుందని బీజేపీ వాళ్లు తనకు రెండేండ్ల కిందటే చెప్పారనీ, దీన్ని బట్టి దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చనీ జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌ కల్యాణ్‌ కడప జిల్లా పర్యటనలో సంచలన వాఖ్యలు చేశారు అయితే, ప‌వ‌న్ వ్యాఖ్య‌లు పాక్ వెబ్‌సైట్లో ప్ర‌చురితం అయ్యాయి.

పాకిస్తాన్‌లోని ప్రముఖ మీడియా సంస్థ `డాన్‌` పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యల్ని ఊటంకిస్తూ తన వెబ్‌సైట్‌లో ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి క్షుప్తంగా సమాచారం ఇస్తూ మనదేశానికి చెందిన ఒక ఇంగ్లీష్‌ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాన్ని లింక్‌ చేసింది. పవన్‌ వ్యాఖ్యలు ఇవేనంటూ ‘డాన్‌’ వెబ్‌సైట్‌ వాటిని ప్రత్యేకంగా హైలైట్‌ చేసింది. కడప జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో పవన్‌ కల్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్టు డాన్‌ వెబ్‌సైట్‌ లింక్‌ చేసిన భారతీయ ఇంగ్లీష్‌ వెబ్‌సైట్‌ కథనం పేర్కొంది. అంతేగాక పవన్‌ కల్యాణ్‌కు గతంలో బీజేపీతో సంబంధాలున్నాయని కూడా తెలిపింది.