Home / 18+ / చుట్టం చూపుకు వస్తున్నావా అంటూ బాలకృష్ణను చుట్టుముట్టిన మహిళలు

చుట్టం చూపుకు వస్తున్నావా అంటూ బాలకృష్ణను చుట్టుముట్టిన మహిళలు

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు నిరసన సెగ తగిలింది. గెలిచిన నాటినుంచీ చుట్టుపు చూపుగా రావడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేసి వెళ్లిపోతుండడంతో బాలయ్యకు పరాభవం జరిగింది. నియోజకవర్గ పర్యటనకు బుధవారం హిందూపురం వచ్చిన బాలకృష్ణకు తొలిరోజే స్థానికులు ప్రశ్నించారు. చిలమత్తూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన బాలయ్య లేపాక్షి నంది సర్కిల్‌ వద్దకు రాగానే జనం ఆయన కారును అడ్డుకున్నారు. ఆయన కారు దిగగానే చుట్టుముట్టారు. హంద్రీనీవా ద్వారా లేపాక్షి మండలంలోని చెరువులకు నీళ్లిస్తామని చెప్పి చిన్న చెరువులను విస్మరించారని మండిడ్డారు.

చుట్టం చూపుకు వస్తున్నావా అంటూ కొందరు ప్రశ్నించారు. మహిళలు కూడా బాలయ్యతో తాము తాగేందుకు నీళ్లులేక అల్లాడిపోతున్నామని చెప్పారు. మీకు చెప్పుకుందామంటే మీరెక్కడుంటారో తెలియదని ముఖం మీదే అనేసారు. పరిస్థితి చేజారుతోందని గ్రహించిన టీడీపీ నాయకులు మరికొందరు జై బాలయ్య అంటూ గందరగోళం సృష్టించారు. అయినా మహిళలు నీటికోసం గట్టిగా నిలదీశారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని కోరారు. ఇంత జరుగుతున్నా కనీసం కిమ్మనని బాలయ్య.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat