Home / MOVIES / ‘ప్రేమకథా చిత్రమ్ 2’ ట్రైలర్ రిలీజ్..హీరోని వెంటాడుతున్నదెయ్యం

‘ప్రేమకథా చిత్రమ్ 2’ ట్రైలర్ రిలీజ్..హీరోని వెంటాడుతున్నదెయ్యం

టాలీవుడ్ లో మారుతి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ హర్రర్ కామెడీ ప్రేమ కథా చిత్రమ్. సుదీర్ బాబు హీరోగా, తెరకెక్కిన ఈ సినిమా అతని కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలవడంతో పాటు, హర్రర్ కామెడీ సినిమాలకి టాలీవుడ్ లో మార్గం ఏర్పరించింది. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ సినిమాగా నిలిచిపోయిన ఈ సినిమాకి సీక్వెల్ హరి కిషన్ అనే దర్శకుడు ప్రేమ కథా చిత్రమ్ 2 తెరకెక్కించాడు. సుమంత్ అశ్విన్, నందిత శ్వేత హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్ తో ఇంటెన్సిటీ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హారర్ కామెడీ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. ‘సంథింగ్ ఈజ్ రాంగ్ .. అదేంటో తెలుసుకోవాలి’ అనే హీరో డైలాగ్ .. ‘ఏం జరుగుతుందో అర్థం కావడం లేదా?’ అనే నందిత శ్వేత డైలాగ్ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ‘ప్రేమకథా చిత్రమ్’ మాదిరిగా .. ఈ సీక్వెల్ విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు తెలుపుతున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat