Home / ANDHRAPRADESH / నేను నోరు విప్పి మాట్లాడితే జనసేన బంద్ అయిపోతుంది.. పూనమ్ ఆవేదన

నేను నోరు విప్పి మాట్లాడితే జనసేన బంద్ అయిపోతుంది.. పూనమ్ ఆవేదన

ఒక అమ్మాయి బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడితే ఇంత బెదిరింపులా..? ఇంత ట్రోలింగ్‌లా..? నోరు విప్పి చెప్ప‌లేవా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..? ప‌ర జా నాయ‌కుడివి అంటున్నావ్‌..? రేప‌టి రోజున ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తావ్‌..? ఒక ఆడ‌ది బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడితే నీవేమి చేస్తావ్‌..? మ‌హిళ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవా..? స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చెప్పేట‌ప్పుడు కొంచెమైనా బుర్ర‌పెట్టి ఆలోచించి మాట్లాడు..! ప‌వ‌న్‌కు బుర్ర లేద‌ని ఇప్ప‌టికే చాలా మంది అంటున్నారు.. ఆ విష‌యం నిజ‌మేన‌ని త్వ‌ర‌లో నిరూప‌ణ అవుతుంది. రేప‌టి రోజున నీకు ఎవ‌రైనా ఓటు వేస్తారా..? నీ మాట ఎవ‌రైనా వింటారా..? అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఉద్దేశించి శ్రీ‌రెడ్డి ఇటీవల దారుణంగా విమర్శించిన విషయం తెలిసిందే.. ఇప్ప‌టికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాల‌క న‌టి పూన‌మ్ కౌర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నారని. ప‌వ‌న్, పూన‌మ్ విష‌యానికి సంబంధించి త‌న వ‌ద్ద పెన్ డ్రైవ్‌లు ఉన్నాయ‌ని చెప్పింది. ఆ పెన్ డ్రైవ్‌ల‌ను కూడా మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై తాను చేస్తున్న ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెలిపేందుకు వ‌స్తున్నవారు ఇచ్చిన‌వేన‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాడుకున్న అమ్మాయిల లిస్టు, ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌లన్నీ ఉన్నాయ‌ని శ్రీ‌రెడ్డి తెలిపింది. ఇదే విషయంపై కత్తి మహేష్ కూడా మాట్లాడుతూ తన వద్ద వీడియోలు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఇప్పుడు వీరు చేసిన విమర్శలన్నీ వాస్తవాలనిపించేలా పలు ఆడియో క్లిప్ లు లీకయ్యాయి. స్వయంగా పూనమ్ కౌర్ తాను పవన్ కోసం ఎంతో చేసానని, తాను నోరు విప్పితే జనసేన బంద్ అయిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా జనసేనకు ఉక్కిరబిక్కిరి పరిస్థితులు తలెత్తనున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అన్నయ్యలా భావిస్తే అతను చేసిన అన్యాయం గురించి, పవన్ మూడో పెళ్లి చేసుకోకుండా అడ్డుపడి రేణుతో తాను కలపాలని చేసిన ప్రయత్నాల గురించి పూనమ్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఆడియో టేపులతో తెలుగురాష్ట్రాల్లో సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగేలా కనిపిస్తోంది.