Breaking News
Home / NATIONAL / లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.

యావత్తు దేశమంతా గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది.చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు.

షెడ్యూలు ప్రకటించినమరుక్షణం నుంచి దేశవాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. లోక్ సభ 543 స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175, ఒడిసా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ సందర్భంగా 17వ లోక్ సభ ఎన్నికలు 7విడతల్లో జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది.

ఏప్రిల్ 18న రెండో విడత , ఏప్రిల్ 23న మూడో విడత, ఏప్రిల్ 29న నాలుగో విడత, మే 6న ఐదో విడత, మే 12న ఆరో విడత, మే 19న ఏడో విడత పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.అయితే నామినేషన్లకు అఖరి తేది మార్చి 25 కాగా మార్చి 26న నామినేషన్ల పరీశీలన. మార్చి 28నామినేషన్ల ఉపసంహరణకు అఖరి తేదిగా ఎన్నికల సంఘం ప్రకటించింది. మొదటి విడతలోనే తెలంగాణ ఏపీ రాష్ట్రాలల్లో ఎన్నికలు జరగనున్నాయి