Breaking News
Home / ANDHRAPRADESH / టీడీపీ ఎమ్మెల్యే అవినీతి, భూకబ్జాదారులు మానుకొ లేదంటే కిడారి గతే

టీడీపీ ఎమ్మెల్యే అవినీతి, భూకబ్జాదారులు మానుకొ లేదంటే కిడారి గతే

ఏపీలో ఎన్నికలవేళ గుంటూరు జిల్లా పల్నాడులో మావోల పేరుతో లేఖలు కలకలంరేపాయి. గురజాల ఎమ్మెల్యే యరపతినేని, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్ ఛైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, దాచేపల్లి ఎంపీపీ నవకుమార్, టీడీపీ నేతలు మునగ నిమ్మయ్య, తంగెళ్ల శ్రీనివాసరావు, పగడాల భాస్కర్‌లను హెచ్చరిస్తూ లేఖలు రాశారు. అవినీతి, భూకబ్జాదారులు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. కిడారి సర్వేశ్వర రావుకు పట్టిన గతే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుకు పడుతుందని హెచ్చరించారు మావోయిస్టులు. యరపతినేనితో పాటు పలువురు టీడీపీ నేతలను హెచ్చరిస్తూ లేఖలు విడుదల చేశారు. ఈ లేఖలు దాచేపల్లి మోడ్రన్ స్కూల్ దగ్గర వెలిశాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో మావోయిస్టు పార్టీకి చెందిన లేఖలు దర్శనమివ్వడం చర్చనీయంశంగా మారింది.