Home / 18+ / ప‌వ‌న్ బ‌రిలో దిగేది ఇక్క‌డి నుంచే..?

ప‌వ‌న్ బ‌రిలో దిగేది ఇక్క‌డి నుంచే..?

ఏపీలోని ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరి చూపు  ఆయా పార్టీల‌ ర‌థ‌సార‌థులు పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపైనే ప‌డింది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాలు ఖ‌రారు అయిన నేప‌థ్యంలో ప‌వ‌న్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే చ‌ర్చ జ‌రిగింది. తాజాగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పోటీపై క్లారిటీ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుండి పవన్‌ పోటీచేసే అవకాశాలున్నాయని సమాచారం.

మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప‌వ‌న్‌ పోటీ చేసే స్థానం ఖరారైనట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కూడా గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో లక్ష సభ్యత్వాలతో గాజువాక నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవడంతో పార్టీ అధినేతను అక్కడి నుంచే పోటీకి దింపాలని క‌మిటీ భావించింది. అంచ‌నా వేసిన‌ట్లే తాజాగా ప‌వ‌న్ అక్క‌డి నుంచి బ‌రిలో దిగుతున్నారు. గ‌తంలో స్క్రీనింగ్ కమిటీ సైతం గాజువాక నుంచి పోటీకే మొగ్గు చూపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat