Home / ANDHRAPRADESH / వైసీపీలోకి రాయ‌పాటి..రాజ్య‌స‌భ‌తో పాటుగా…?

వైసీపీలోకి రాయ‌పాటి..రాజ్య‌స‌భ‌తో పాటుగా…?

ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివరావు తెలుగుదేశం పార్టీకి గుడ్‌భై చెప్ప‌డం ఖ‌రారైంది. నరసరావుపేట పార్లమెంట్‌ స్థానంపై టీడీపీ అధిష్ఠానం నుంచి హామీ రాకపోవడంపై రాయపాటి అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై ఆయన తన అనుచరులు, అభిమానులతో కలిసి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నరసరావుపేట ఎంపీ టికెట్ విషయంలో నా కంటే సమర్థులు ఎవరున్నారని ఎంపీ రాయపాటి ప్రశ్నించారు. ఒకవేళ ఉన్నట్లయితే వారికే టికెట్‌ ఇవ్వొచ్చని, ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అధిష్టానం మళ్లీ టికెట్‌ ఇస్తే మళ్లీ పోటీ చేస్తానని వెల్లడించారు. టికెట్‌ రాకపోతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

ఇదిలాఉండ‌గా, వైసీపీ ముందు ఆయ‌న రెండు ప్ర‌తిపాద‌న‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. వైసీపీ తరపున రాజ్యసభ కు రాయపాటిని పంపి కుమారుడికి అసెంబ్లీ ఇస్తారని ప్రచారం జ‌రుగుతోంది. రాయపాటి వైసీపీలోకి వస్తే అభ్య‌ర్థుల సమీకరణాలు కూడా మారనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్య‌ర్థి కూడా మారే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.