Home / 18+ / కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రాలో సెంటిమెంట్ రెచ్చగొట్టేద్దాం అనుకుని మొండి కత్తితో యుద్ధానికి బయల్దేరుతున్న చంద్రబాబు

కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రాలో సెంటిమెంట్ రెచ్చగొట్టేద్దాం అనుకుని మొండి కత్తితో యుద్ధానికి బయల్దేరుతున్న చంద్రబాబు

తెలంగాణా సీఎం కేసీఆర్ పేరు చెప్పి ఆంధ్రా ఓటర్లలో సెంటిమెంటు రెచ్చగొట్టాలని చంద్రబాబు ఎందుకు కష్టపడుతున్నారో గాని దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎవరైనా సలహా ఇచ్చారో లేక ఆయనే వ్యూహ రచన చేశారో కాని మొండి కత్తితో యుద్ధానికి బయలుదేరినట్టే. ఆంధ్రా ప్రజల దృష్టిలో కేసీఆర్ విలనేమీ కాదు. ఆయనకు ఏపీ రాజకీయాల్లో ఎటువంటి ఆసక్తి లేదని అందరికీ తెలుసు. కిందటి తెలంగాణా ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు పెత్తనం చేస్తాడని అధికార పార్టీ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ కు వనరులు సమకూర్చడం, అభ్యర్థుల ప్రకటనకు ముందు రాజస్థాన్ ప్రస్తుత సిఎం అశోక్ గెహ్లోత్ అమరావతి వెళ్లి బాబుకు లిస్టు చూపించడం తెలిసిందే. ఇలాంటి చర్యల వల్ల ఆయన తెలంగాణాలో పరోక్ష పాలన సాగించాలని కోరుకుంటున్నట్టు తెలంగాణా ప్రజలు అనుమానించారు. ఈ కారణం వల్లే తటస్థులు కూడా ఆఖరు నిమిషంలో కారు పార్టీకి మద్ధతుదారులుగా మారిపోయారు. దీన్నీ పసిగట్టిన కేసీఆర్ “ఇక్కడ చంద్రబాబుకేం పని” అని ప్రశ్నించడం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. తెలంగాణాలో ప్రభావం చూపిన ఫార్ములాతో ఏపీ ప్రజానీకాన్ని రెచ్చగొట్టాలంటే కుదరదు.

1) ఆంధ్రలో టీఆరెస్ పార్టీ శాఖలు లేవు. ఏర్పాటు చేయాలన్న ఆసక్తీ లేదు
2) ఏపీలో కేసీఆర్ కు నివాసం లేదు. తెలంగాణా ముఖ్యులకు ఆస్తులు లేవు.
3) ఆయన ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.
4) సీమాంధ్ర ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు.
5) ఒక్కో గ్రామం నుంచి ఒక్క రైనా జీవనాధారం కోసం తెలంగాణా వచ్చిన వారున్నారు.
6) కొన్ని గ్రామాల్లో ఇంటికొకరు తెలంగాణా వలస వచ్చారు.
7) సెటిలర్లు ఇక్కడ ఎటువంటి వివక్షను ఎదుర్కోవడం లేదు. వారిలో చాలా మంది తమ రాష్ట్రం కంటే తెలంగాణాలోనే హాయిగా ఉన్నామని చెబ్తారు. ఇక్కడ స్థిర పడిన వారి కుటుంబాల్లోని పిల్లు తెలంగాణా యాసలో మాట్లాడుంటే పేరెంట్స్ కుశ్ అవుతున్నారు. రాష్ట్రం విడిపోక ముందు రోజుల్లో తమ వేష, భాషలు తెలంగాణా కంటే గొప్పవనే భ్రమ ఉండేది.
8) జూబ్లీ హిల్స్ పెద్దమ్మ(గ్రామ దేవత) ఆలయానికి రోజూ వచ్చే భక్తుల్లో సగం మంది సెటిలర్లే ఉంటారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాలుపంచుకోవడం, బోనాల పండుగను జరుపుకోవడం ఇక్కడి సంస్కృతిలో ఇమిడి పోవాలన్ని తాపత్రయాన్ని చూపుతోంది.
9) ఇటువంటి పరిస్థితుల్లో కెసీఆర్ ను బూచిగా చూపిస్తే అక్కడ ప్రజలు ఎందుకు ఆవేశ పడతారు?
10) మొన్నటి తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కూటమి చిత్తుగా ఓడింది.
11) రాహుల్, సోనియా, చంద్రబాబులు ప్రచారం చేసినా కేసిఆర్ ఒంటి చేత్తే వారిని మట్టి కరిపించారు. రెండో సారి ఘన విజయం సాధించిన కేసీఆర్ ఆంధ్రా ప్రజల దృష్టిలో హీరోగా నిలిచారు. తన పోరాటం తెలుగుదేశం పైనే కానీ ఇక్కడ జీవిస్తున్న ఏపీ ప్రజలపై కాదని ఆయన భరోసా ఇచ్చారు. వారిని గుండెల్లో దాచుకుంటామని కేసీఆర్ చెప్పిన మాటలు అందరిలో సంతోశాన్ని నింపాయి.
12) చంద్రబాబు మేనకోడలు నందమూరి సుహాసిని పోటీ చేసిన కూకట్ పల్లి నియోజకవర్గంలో సెటిలర్లు పెద్ద సంఖ్యలో ఉన్నా వారు ఆమెను ఆదరించలేదు. చంద్రబాాబు, రాహుల్ గాంధీలో తిరిగినా కే సీఆర్ పట్ల ఎటువంటి వ్యతిరేకత కనపడలేదు. కూకట్పల్లిలో కారును గెలిపించడం ద్వారా ఆంధ్ర ప్రాంత ఓటర్లు కారు పార్టీకి మద్ధతు పలికారు. టీఆరెస్ రెండో సారి గెలవడంలో వారి పాత్ర కాదనలేనిది.
13) చంద్రబాబు హెరిటేజ్ ప్రధాన కార్యాలయం ఇప్పటికీ హైదరాబాద్ లోనే ఉంది. కంపెనీ చెల్లించే జీఎస్టీ, ఆదాయ పన్నుల్లో కేంద్రం నుంచి రాష్ట్రం వాటాగా వచ్చే నిధులు తెలంగాణాకే దక్కుతాయి.
14) చంద్రబాబు కుటుంబం, ఆయన వియ్యంకుడు, దగ్గరి బంధువుల నివాసాలు, ఆస్తులు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్నాయి.
15) తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అనేక మంది ఆస్తులు పరిశ్రమలు, వ్యాపార సంస్థలు హైదరాబాదులో ఉన్నాయి. చంద్రబాబు అనుయాయులకు హైదరాబాద్ మక్కా లాంటి పుణ్య స్థలం.
16) ఫోన్ ట్యాంపింగులు, ఓటుకు నోటు కేసులో అరెస్టులు భయానికి అమరావతి వెళ్లారే కానీ ఇష్టంగా తరలి పోలేదని అందరికీ తెలుసు.
17) చంద్రబాబు, లోకేశ్ లు ఎక్కువగా రాకున్నా బ్రాహ్మణి, భువనేశ్వరి నెలలో రెండు సార్లయినా హైదరాబాద్ వచ్చి వెళ్తారు.
18) మీకైతే తెలంగాణా కావాలి కాని సాధారణ ప్రజలు తెలంగాణా ముఖ్యమంత్రిని వ్యతిరేకించాలని ఆశించడం స్వార్థం రాజకీయ ప్రయోజనాలు కాక ఇంకేమనుకోవాలి?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat