Home / 18+ / వైఎస్ వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు

వైఎస్ వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని ప్రముఖ నటుడు మోహన్ బాబు సందర్శించారు.. ఇలాంటి వ్యక్తిని హత్య చేయడం దారుణమన్నారు. ఈ అరాచకాలకు అంతే లేదా అని ప్రశ్నించారు. శుక్రవారం రాత్రి వైఎస్‌ వివేకా భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతుందో అర్థమే కావడం లేదన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యా ప్రయత్నంపైనా మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తాజాగా వివేకా హత్యపై కూడా మోహన్ బాబు టీడీపీ ప్రభుత్వాన్ని అనుమానిస్తూ వ్యాఖ్యలు చేసారు. భగవంతుడు వైఎస్ కుటుంబాన్ని క్షోభపెడుతున్నాడన్నారు. కచ్చితంగా ఆ కుటుంబానికి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తన పెద్ద కొడుకు మంచు విష్ణుతో కలిసి ఆయన వివేకాకు నివాళులర్పించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat