Home / 18+ / వివేక హత్యతో బాబు చరిత్ర బయటకు..?

వివేక హత్యతో బాబు చరిత్ర బయటకు..?

చ‌ంద్ర‌బాబు చరిత్ర గురించి ఆయన ప్రత్యర్థులు కథలు..కథలుగా చెబుతుంటారు. ఎన్టీఆర్ ను పదవీచిత్యుడిని చేసిన దగ్గర నుంచి రాజకీయంగా ఎదిగే వరకూ మొత్తం వ్యవహారాలను ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకం రాసి వెలువరించారు. అందులో అధికారం కోసం అడ్డువ‌చ్చిన వారిని ఏమైనా చేయడానికి బాబు వెనుకాడరని చెప్పుకొచ్చాడు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం నాడు ఎన్టీ రామారావును వెన్నుపోటుతో మాన‌సికంగా కుంగిపోయేలా చేసి ఆయ‌న మ‌ర‌ణానికి కార‌కుడ‌య్యాడని… ఆ త‌రువాత 1998లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని క‌ట్ట‌డి చేసేందుకు ఆయ‌న తండ్రి వైయ‌స్ రాజారెడ్డిని హ‌త్య చేయించాడనే ఆరోపణలు చేశారు.

ఇక త‌న ప‌త‌నం త‌ప్ప‌ద‌న్న సంకేతాల నేపథ్యంలోనే ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హ‌త్యాయ‌త్నం చేయించాడని వైసీపీ శ్రేణులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుంటాయి. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు 26 రోజుల ముందు వైఎస్ జ‌గ‌న్‌ను మాన‌సికంగా కుంగ‌దీసేందుకు, పార్టీ శ్రేణులను భ‌యాందోళ‌న‌కు గురి చేసేందుకు వైఎస్ వివేకానంద‌రెడ్డిని దారుణంగా హ‌త్య చేయించాడని ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది.. వివేకానంద హత్య జరిగిన రోజు రాత్రి మంత్రి అది నారాయణ రెడ్డి , టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఆంధ్ర జ్యోతి ఎండీ రాధాకృష్ణ ,లోకేష్ ల కాల్ డేటా చూస్తే నిజాలు బయటకి వస్తాయని వైసీపీ నాయకులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

ఉత్తరాంద్ర పర్యటన లో నన్ను చంపడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది అని అర్ధం వచ్చేలా పవన్ అప్ప‌ట్లో మాట్లాడాడు. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు స‌పోర్టు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కూడా చంప‌డానికి స్కెచ్ వేశారంటే ఏపీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా అనంతపురం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. అనంతపురం జిల్లా ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (చౌదరి) రేపు ఎన్నికల్లో గెలిచి మన టీడీపీ ప్రభుత్వం రాగానే మన ప్రత్యర్థులను నరుకుదాం, ఆరు నెలల్లోగా అంతమొందిద్దాం , పోలీస్ అంతా మన వాళ్లే అని చెప్పిన ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి.

ఇటీవ‌ల చంద్ర‌బాబు 37 మందికి డీఎస్సీలుగా ప్రమోషన్ ఇస్తే అందులో 35 మంది బాబుకు చెందిన సామాజిక వర్గ కుల‌స్తులే ఉన్నారని.. దీన్ని బట్టి పోలీసులు టీడీపీకి తొత్తులుగా మారాయని.. వారిపై నమ్మకం లేదని స్వయంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. అందుకే తెలంగాణ పోలీసులను ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు.

నన్ను.. వంగవీటి రంగా ను చంపించాలని ప్రయత్నం చేసాడని.. రంగా విషయం లో సక్సెస్ అయ్యాడు కానీ… నన్ను చంపాలని బాబు మనుషులను పంపాడు అని అప్పటి టీడీపీ హోం మంత్రి ఇంద్రా రెడ్డి చెప్పడం దుమారం రేపుతోంది. ఆ మాటలు చంద్రబాబును తీవ్రంగా ఇరుకున పెట్టాయి.. అలాగే మిమ్మల్ని చంపడానికి ఒక టీం బయలుదేరింది జాగ్రత్త అని అప్పటి పోలీస్ కమిషనర్ గన్ మెన్ నాకు ఫోన్ చేసి చెప్పాడని ఒక ఇంటర్వ్యూ లో కన్నా లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.

కాపునాడు నాయకుడు వంగవీటి రంగా ను అప్పట్లో చంపడానికి బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టీడీపీలో దేవాదాయ శాఖ మంత్రి గా చేసిన దండు శివరామరాజు నాతో చెప్పిన వారం రోజులకు రంగా ను చంపారని ఇటీవలే సీనియర్ నేత హరిరామజోగయ్య బాంబు పేల్చిన సంగతి తెలిసిందే..

అవును రంగా హత్య వెనకాల బాబు ఉన్నాడు ముద్రగడ కూడా స్పష్టం చేయడం గమనార్హం. వంగవీటి రంగ హత్యలో టీడీపీ ప్రభుత్వ పాత్ర ఉందని వంగవీటి నరేంద్ర ఆరోపిస్తున్నాడు.

ఇక ఎన్టీఆర్ మీద ఉత్తుత్తి హత్యా ప్రయత్నం చేసిన మల్లెల బాబ్జి మరణం వెనక బాబు హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 3 లక్షలు ఇస్తాము, ఎన్టీఆర్ మీద ఉత్తుత్తి హత్యా ప్రయతం చేయి అని బాబు చెప్పినట్టు.. ఎన్టీఆర్ గ్రాఫ్ పడిపోతున్నవేల బాబు, ఎన్టీఆర్ కలిసి ఈ నాటకం ఆడారారని విమర్శలు వచ్చాయి.

మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మనవడు పింగళి దశరథరాం ఎన్‌కౌంట‌ర్‌ అనే మేగజైన్ ను విజయవాడ నుంచి నడిపేవాడు. అందులో బాబు ఆవినీతి కుల ప్రీతి గురించి పుంఖానుపుంఖాలుగా రాసేవాడు. బాబుపాత్రపై ఎన్నో ప్రశ్నలు ఆయన లేవనెత్తాడు. ఇలా చంద్రబాబు అధికారం కోసం ఏమైనా చేస్తాడని ఇప్పుడు వైఎస్ వివేక మరణం సందర్భంగా ఆయన ప్రత్యర్థులు ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.