Home / 18+ / లోకేశ్ మంగళగిరి నుంచే పోటీ చేయడానికి కారణాలివే.. కామెడీ షో చూసేందుకు మాత్రమే జనం వస్తున్నారా

లోకేశ్ మంగళగిరి నుంచే పోటీ చేయడానికి కారణాలివే.. కామెడీ షో చూసేందుకు మాత్రమే జనం వస్తున్నారా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేయించడంలో భారీ స్కెచ్ ఉందట.. ఏపీ మొత్తం తొల‌గించిన ఓట్లు 25 లక్ష‌ల 47వేలు కాగా ఒక్క రాజ‌ధాని ప్రాంతం అయిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తొల‌గించిన ఓట్ల సంఖ్య‌ 6ల‌క్ష‌లు అని సాక్షాత్తూ ఎన్నిక‌ల క‌మీష‌నే చెబుతోంది. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం గుంటూరు జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ మ‌ద్ద‌తుదారుల ఓట్ల‌ను తొల‌గించారు.. న‌ర‌స‌రావు పేట‌లో 20,200, చిల‌క‌లూరిపేట‌లో 7వేలు, మంగ‌ళ‌గిరిలో 23,500 ఓట్లు తొల‌గించారు. వీరంతా వైసీపీ సానుభూతిపరులేనని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పోయిన ఓట్లు ప్ర‌తిపక్ష పార్టీకి చెందిన‌వారివే అని చెప్ప‌డానికి సాక్ష్యాలు కూడా క‌నిపిస్తున్నాయి.

దీంతో మంగ‌ళ‌గిరిలో వైసీపీ స‌ర్పంచులు, ఎంపీటీసీల ఓట్‌కను కూడా అక్ర‌మంగా తొల‌గించారు. అంతేకాదు 13,000 దొంగ ఓట్లు సృష్టించిన‌ట్టు కూడా త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి చాలాసార్లు ఫిర్యాదులు కూడా చేసారు. విప‌క్ష నాయ‌కుల ఓట్ల‌నే తీసేస్తుంటే సామాన్యుల ఓట్ల‌కు భ‌ద్ర‌త ఉంటుందా? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకం. లోకేష్ ను మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేయించ‌డానికి కార‌ణం కూడా అక్క‌డి ప్ర‌తిప‌క్ష పార్టీ సానుభూతి ప‌రుల ఓట్లను తొల‌గించ‌డం వ‌ల్లేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే లోకేశ్ రోడ్ షోకు ఏమాత్రం ప్రజలు వెళ్లకపోవడం, ఆ వెళ్లే కొద్దిమంది కూడా లోకేశ్ కామెడీ షోలు చూడడానికి ఎగబడుతున్నారట.. మంగళగిరిలో లోకేశ్ ఊపు చూస్తుంటే డిపాజిట్లు కూడా వచ్చేలాలేవంటూ సెటైర్లు వేస్తున్నారు వైసీపీ శ్రేణులు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat