Home / ANDHRAPRADESH / లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై హైకోర్టు సంచలన తీర్పు..వర్మ కళ్ళలో ఆనందం..!!

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై హైకోర్టు సంచలన తీర్పు..వర్మ కళ్ళలో ఆనందం..!!

 

లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ చిత్రాల విడుదలను నిలిపివేయాలని గత కొన్ని రోజుల క్రితం దాఖలైన పిటీషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. వచ్చేనెల  11న రెండు తెలుగు రాష్ట్రాల్లో  రసవత్తరంగా జరగనున్న ఎన్నికల నేపధ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని విడుదలను ఆపాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలోనే ఆ సినిమాలపై దాఖలైన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. ఆ చిత్రాల విడుదలలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. దేశంలోని ప్రతీ వ్యక్తికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని, కాబట్టి  ఈ రెండు సినిమాల విడుదలను ఆపటం కుదరదని  హైకోర్టు స్పష్టం చేసింది.హైకోర్టు తీర్పు సందర్భంగా వర్మ పలు ట్వీట్లు చేశారు.