Home / ANDHRAPRADESH / విద్యార్ధుల జీవితాలతో బాబు చెలగాటం..!!

విద్యార్ధుల జీవితాలతో బాబు చెలగాటం..!!

శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్‌ బాబు ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇన్ని రోజులు రాష్ట్ర ప్రజలనుంచి దోచుకున్న డబ్బును మళ్ళీ ఎన్నికల సమయంలో వాళ్ళకే ఇస్తున్న చంద్రబాబు మా విద్యార్ధులకు మాత్రం ఎందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదు అని ప్రశ్నించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ పై ఎన్నిసార్లు ఉత్తరం రాసినా కుడా స్పందించడం లేదన్నారు.ముఖ్యమంత్రి అహంకారం పరాకాష్టకు చేరిపాయిందన్నారు.ఉన్నత స్థానాల్లో ఉన్న మనుషుల యొక్క జీవితం గురించి సువర్ణాక్షరాలతో రాసేలా ఉండాలి.కాని నీ గురించి రాయడానికి నువ్వేమీ సత్య హరిశ్చంద్రుడివి, ధర్మరాజువి కాదు.అయినా..నాకు ఇవన్నీ అనవసరం. నా విద్యార్ధుల జీవితాలతో చెలగాటం అడకుడా..విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఇస్తే చాలు..అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.