Home / ANDHRAPRADESH / మరో మూడు రోజల్లో ఏపీలో హత్యలు, విధ్వంసాలు.. బాబు కుట్ర!

మరో మూడు రోజల్లో ఏపీలో హత్యలు, విధ్వంసాలు.. బాబు కుట్ర!

రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు రోజుల్లో దహనాలు, హత్యలు, దాడులు చేసేందుకు చంద్రబాబు తన టీడీపీ నాయకులు, శ్రేణులను సిద్ధం చేశారని ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం పులివెందుల స్థానానికి అభ్యర్థిగా జగన్ నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో చంద్రబాబు చేస్తున్న కుట్రలపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు, పవన్ ల మ్యాచ్ ఫిక్సింగ్ పై నిజాలు వెల్లడించారు.

పవన్ కళ్యాన్ పేరెత్తకుండా ఆయన్ను చంద్రబాబుకు పార్ట్ నర్ గా జగన్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు విపరీతమైన కుట్రలకు తెరతీశారని.. కలుషితమైన రాజకీయాలు ఏం జరుగుతున్నాయో అర్థం కావడం లేదని వాపోయారు.పులివెందుల నుంచే చంద్రబాబు హత్య రాజకీయాలు మొదలు పెడుతున్నారని.. చిన్నాన్నను అతి దారుణంగా చంపివేసిన వీళ్లే మనపై బురద జల్లుతున్నారని జగన్ మండిపడ్డారు. వీళ్లే పోలీసులతో విచారణ చేయిస్తారని.. తప్పుడు విచారణలతో కుట్రలు, కుతంత్రాలు చేసి వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని జగన్ విమర్శలు గుప్పించారు.

ఐదేళ్ల పాలనలో ఎన్నో అన్యాయాలు చేయడంతో రాష్ట్రంలో ఈసారి టీడీపీకి ఎన్నికల్లో డిపాజిట్లుకూడా రావని.. అందుకే జమ్మలమడుగులో మా చిన్నాన్నను చంపి ఆ నేరాన్ని తమ కుటుంబ సభ్యులపై మోపి ఎవరినైనా అన్యాయంగా అరెస్ట్ చేసి చివరకు పులివెందులలో ఎన్నికలు జరపనివ్వకుండా చేయడానికి బాబు కుట్ర పన్నారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు.కడప హత్యారాజకీయాలు చేయడానికి బాబు స్కెచ్ గీశాడని మండిపడ్డారు.

నాడు కాంగ్రెస్ తో కుమ్మక్కై నన్ను ఇబ్బండి పెట్టి కేసులు నమోదు చేయించిన సీబీఐ అధికారిని ఇప్పుడు చంద్రబాబు భీమిలిలో టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశాడని.. కానీ విమర్శలు రావడంతో తన పార్ట్ నర్ పవన్ తో విశాఖ ఎంపీ టికెట్ ఇప్పించి బాబు-పవన్ డ్రామాలు ఆడుతున్నారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. నిన్న సీబీఐ అధికారి నామినేషన్ వేస్తే అక్కడ టీడీపీ జెండాలు కనిపించాయని.. చంద్రబాబు-పవన్ పార్ట్ నర్స్ అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు స్క్రిప్ట్, ఆదేశాలతోనే పవన్ అభ్యర్థులను ప్రకటిస్తున్నాడని జగన్ మండిపడ్డారు. ప్రతిపక్షం ఓట్లు చీల్చేందుకు జిత్తులు, ఎత్తులు ఆడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గ్రామాలకు విచ్చలవిడిగా డబ్బులు పంపుతున్నారని.. ఆ డబ్బును నవరత్నాల పథకాలతో కొట్టిపారేస్తామని జగన్ అన్నారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో గెలుస్తామని జగన్ అన్నారు.