Home / POLITICS / రైతు స‌మ‌గ్ర‌ స‌ర్వే…ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణయం

రైతు స‌మ‌గ్ర‌ స‌ర్వే…ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణయం

అన్న‌దాత‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2014లో నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ మాదిరిగానే ‘రైతు సమగ్ర సర్వే’ చేపట్ట‌నుంది. ప్రత్యేకంగా రైతుల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం స‌న్న‌ద్ధ‌మైంది. ఇప్పటివరకు రైతుల కచ్చితమైన వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవు. దీంతో పథకాల రూపకల్పనలో ఇబ్బందు లేర్పడుతున్నా యి. ఈ పరిస్థితిని అధిగమించేందు కు ఓ డేటాబేస్‌ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ నెల 25 నుంచి మే 15లోగా రాష్ట్రంలో ని 54లక్షలకుపైగా ఉన్న రైతుల వివరాలు సేకరించనుంది .

రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్ట‌నున్న కీల‌క స‌ర్వేలో భాగంగా 39 అంశాలతో ఫార్మాట్‌ రూపొందించారు. ప్రతి ఏఈఓ తమ పరిధి గ్రామాల్లోని రైతుల వివరాలను ట్యాబ్స్ లోని ప్రత్యేక పోర్టల్ లో అప్ లోడ్‌ చేస్తారు. ఆధార్‌ కార్డు ల వివరాలతో సహా రైతుల విద్యార్హత, పండించే పంటలు, నీటి వసతి, నేలల రకాలు, వ్యవసాయంలో టెక్నా లజీ వాడకం, పంట రుణాలు, పంట బీమా, సేంద్రియ వ్యవసాయం వంటి అంశాలను సేకరిస్తారు. సర్వే విశ్లేషించి నిర్ణయాలు సర్వే వివరాలను విశ్లేషించి ఏ ప్రాంతంలో ఏ నేలలున్నాయి, అక్కడ ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు సాగు చేయాలి..తదితర అంశాలపై రైతులకు వ్యవసాయ అధికారులు సూచనలు చేయనున్నారు. ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను అంచనా వేసి ఆయా పంటల సాగుకు రైతులను సమాయత్తం చేస్తారు.