Home / ANDHRAPRADESH / చంద్రబాబు చేసేది అభివృద్ధి కాదు..కేవలం మాటలు.. అవినీతి, హత్యలతో ప్రజలు ఆందోళన

చంద్రబాబు చేసేది అభివృద్ధి కాదు..కేవలం మాటలు.. అవినీతి, హత్యలతో ప్రజలు ఆందోళన

చంద్రబాబు చేసేది అభివృద్ధి కాదు.. కేవలం మాటలు చెప్తున్నాడు.. అవినీతి, హత్యలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ప్రజలను పట్టించుకునే నాథుడు కరువయ్యారని అభివృద్ధి ఆగిపోయిందని వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. నాన్నగారు అభివృద్ధి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేయడమే కాకుండా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలోజగన్ రాష్ట్రాన్ని మరోసారి సుడిగాలి పర్యటన ద్వారా చుట్టేస్తున్నారు. దాదాపు 3648 కిలోమీటర్లు సాగింది పాదయాత్ర దారి పొడవునా కష్టాలు విన్నాను.. సమస్యలు చూశాను. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయగలిగానంటే దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు, దారి పొడవునా కష్టాలు, విన్నాను, సమస్యలు చూశాను. నాన్నగారి హయాం తరువాత, చనిపోయిన తరువాత ప్రజల గుండెల్లో ఉండాలని ఆరాటంతో పనిచేసేవారు కరువయ్యారు. నాన్న చనిపోయిన తరువాత మీకు ఎవరూ లేరని అనుకోవద్దు. నాన్న పోతూ పోతూ మమ్మల్ని మీకు ఇచ్చిపోయారు. ఇంత పెద్ద కుటుంబం నీకు తోడుగా ఉంటుందన్నారు. చంద్రబాబు ఐదు సంవత్సరాల పాలన చూశాం. గిరిజన ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఆరు మంది వైయస్‌ఆర్‌ సీపీ నుంచి గెలిచారని ఏరకంగా కక్ష సాధించారో వేరే చెప్పాల్సిన పనిలేదన్నారు. మన ప్రభుత్వం అని మీ అందరి నోటి నుంచి వచ్చేలా గొప్ప పాలన చేస్తా. బ్యాక్‌లాక్‌ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
20 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మనం వేసే ఓటు ఎవరికి వేయాలని గుండెలపై చేయి వేసుకొని ఎటువంటి కావాలనే ఆలోచన చేయడం మర్చిపోవద్దు. చంద్రబాబు చేసింది చేసింది చేయనట్లుగా ఆయన ఈ మధ్య కాలంలో టీవీల్లో అడ్వటైజింగ్‌లు ఇస్తున్నాడన్నారు. ఆయన పాలనలో అవినీతిని చూశాం. హత్యలు చూశాం. దుర్మార్గాలు చూశాం. మోసం చూశాం. కానీ చెప్పేమాటలు మాత్రం ధర్మరాజుకు ధర్మం చేయడం తానే నేర్పినట్లు, హరిశ్చంద్రుడికి సత్యం పలకడం తానే చెప్పినట్లుగా బిల్డప్‌ ఇస్తాడన్నారు. చంద్రబాబు చేసింది అభివృద్థి కాదని కేవలం అవినీతి మాత్రమేనన్నారు. మీడియాను మేనేజ్‌ చేయడంలో ఆయన్ను మించిన వ్యక్తే ఉండడు. ఐదు సంవత్సరాలు అందరిని మోసం చేసిన నోట్లో నుంచి వచ్చే పదం మీ భవిష్యత్తు నా బాధ్యత అని అంటున్నాడు. నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా.? అని ప్రశ్నించారు. ఇటువంటి వ్యక్తి మీ భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాడు. రాష్ట్రానికి ఇంత అన్యాయమైన పాలన చేసిన ఈ వ్యక్తి రాష్ట్రానికి ఐదేళ్లలో 650 అవార్డులు వచ్చాయని, నంబర్‌గా చేశానని చెబుతున్నాడు. రాష్ట్రాన్ని చంద్రబాబు రుణమాఫీ ఎగ్గొట్టడంలో నంబర్‌ చేశాడు. పొదుపు సంఘాలు రుణాలు మాఫీ చేస్తానని నంబర్‌ వన్‌ మోసం చేశాడన్నారు. చంద్రబాబు చేసింది అభివృద్ధి కాదని తాను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. తాను ప్రపంచ దేశాలను చూసి అభివృద్ధిపై ఒక అంచనాకు వచ్చినట్టు తెలిపారు. ప్రతీ పేదవాడు సంతోషపడేలా అభివృద్ది చేసి చూపిస్తానని జగన్ మాట ఇచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat