Home / 18+ / ఇందూరు విజేత “బతుకమ్మ” నే…!

ఇందూరు విజేత “బతుకమ్మ” నే…!

నిజామాబాద్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత కల్వకుంట్ల కవిత దే , ఇక ముందు నిజామాబాదు అభివృద్ధి లో దూసుకుపోవాళ్ళన్నా , పసుపు బోర్డు ఏర్పాటు కావాలన్న కవిత నే మల్లి ఇందూరు ఎంపీ గ ఎన్నుకోవాలని నిజామాబాదు ప్రజలు కచ్చితమైన అభిప్రాయానికి ఇప్పటికే వచ్చేసారు . ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన అంతిమ విజయం కవిత దే , మహిళలు , రైతులు , యువత , సబ్బండ వర్గాలు టీఆర్ఎస్ తోనే ఉన్నారు .

కవిత గారు గత ఐదు సంవత్సరాలుగా పసుపు బోర్డు కోసం చేసిన కృషి చాలా గొప్పది , జాతీయ పార్టీలని చెప్పుకొనే కాంగ్రెస్, బీజేపీలకు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని హామీలు ఇప్పుడు ఓట్ల కోసం గుర్తుకువస్తున్నాయి , ప్రజలు వీరికి తమ ఓటు ద్వారా తగిన బుద్ది చెప్పబోతున్నారు ..

 

తెలంగాణ ఉద్యమ బిడ్డ , జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు , నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత ను విమర్శించే స్థాయి ఇందూరు ప్రత్యర్థి అభ్యర్థులకు లేదు , బీజేపీ అభ్యర్థి తండ్రిని కాంగ్రెస్ లో ఘోర అవమానం చేస్తే కెసిఆర్ ఔదార్యము వల్ల ఆ కుటుంబాన్ని పైకి లేపి నిలబెట్టింది టీ ఆర్ ఎస్ .. ఈ రోజు బీజేపీ టికెట్ ఇచ్చింది అంటే తన తండ్రికి టీ ఆర్ ఎస్ఇచ్చిన పదవులను చూసి మాత్రమే .. బీజేపీ అభ్యర్థి కి , తన అన్న కు నిజామాబాదు లో ఉన్న కీర్తి ప్రత్సిష్ఠలతో నిజామాబాదు జిల్లా లో వీళ్ళు కనీసం వార్డ్ మెంబెర్ గ కూడా గెలవలేరు .. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆచూకీ కూడా లేదు, బరి లో ఉన్న సంగతి కూడా చాలా మందికి తెలీయని విపత్కర పరిస్థితి , కానీ కవిత తెలంగాణ లో ఎక్కడి నుండి ఐన పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న నాయకురాలు . వీళ్ళ స్థాయి ని మించి విమర్శలు చేయడం వల్ల వీళ్లకు డిపాజిట్ లు గల్లంతయ్యే పరిస్థితి .. పాపులారిటీ రావాలంటే ఏదైనా ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నాలు ఏమైనా చెయ్యాలి కానీ .. ప్రజాధారణ ఉన్న నాయకులపై విమర్శలు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు .

 

తరతరాలుగా తెలంగాణ లో వివక్షకు గురవుతున్న మహిళలను మరియు మన సంస్కృతి, సంప్రదాయాలను జాగృతం చేసేందుకు తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించి సమైక్యరాష్ట్రంలో గుర్తింపు కోల్పోతున్న బతుకమ్మ పండుగ తాను భుజానేసుకుని ప్రపంచం గుర్తించి గౌరవించేలా విశిష్టతను ఎలుగెత్తి చాటిన ఘనత ఆమెకే దక్కింది. విదేశాల్లో సైతం బతుకమ్మ పండుగను ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహిస్తున్నారు అంటే దీనికి వెనక కవితక్క కృషి ఎనలేనిది. ఒకమాటలో చెప్పాలంటే మరుగున పడిన బతుకమ్మ పండుగకు పునర్ జీవం పోసింది కవితక్కే.

 

2009లో ప్రత్యేక రాష్ట్రానికై తన తండ్రి కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు పూనుకుంటే కూతురిగా తండ్రి పక్క ఉండాల్సిన సమయంలో తన తండ్రి ఆశయ సాధన కోసం ఉద్యమకారులకు మద్దతుగా నిలబడడమే కాకుండ ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపుతున్న అప్పటి పాలకుల దుర్మార్గాన్ని ఎండగడుతూ అండగా నిలబడింది.

 

ఒకవైపు ఉద్యమం చేస్తూ ఇంకోవైపు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను ఖండాంతరాలకు వ్యాప్తి చెందేలా కృషి చేసారు కవితక్క.తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పార్లమెంట్ సభ్యురాలిగా గెలిచి తెలంగాణ ప్రగతికై చట్టసభలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాలపై గట్టిగా పోరాడుతున్నారు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు సైతం కవిత గారు సమస్యలపై వివిధ అంశాలపై చేస్తున్న ప్రసంగాలకు ముగ్ధులైన గొప్ప వక్తగా అభివర్ణించడం విశేషం.

 

ఉద్యమంలో భాగంగా జాగృతి ద్వారా బతుకమ్మ ను తెలంగాణ మొత్తం నిర్వహించి మహిళలను ఉద్యమం లో భాగస్వాములుగా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కవిత అక్క పాత్రను జాగృతి వేదికను మరువలేనిది.

సమైక్య పాలనకు చరమ గీతం పాడుతూ, నాలుగు కోట్ల ప్రజల ఆశయాన్ని నెరవేరుస్తూ, వందలాదిమంది బిడ్డల ఆత్మ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు. ఈ రోజు ప్రపంచం అంత బతుకమ్మ ను సగౌరవంగా జరపడానికి కారణం కవిత ఇది జగం ఎరిగిన సత్యం .ఈ విజయాన్ని తట్టుకోలేని ప్రతిపక్ష నాయకులూ కవిత అక్క పై సంస్కార హీనంగా ,సభ్యత మరచి మాట్లాడటం వారి విజ్ఞతను చూపిస్తుంది .

నిద్రాహారాలు మాని ,తన కుటుంబ సభ్యులను వదిలి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచాన్ని కె పరిచయం చేస్తూ తెలంగాణ ప్రజలు గర్వపడే స్థాయి లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించి విదేశాల లో ఆయా దేశాలు బతుకమ్మ పండగ ను అధికారికంగా (ప్రభుత్వ సహాయం ) నిర్వహించే స్థాయి కి తీసుకొచ్చిన మన ఆడ బిడ్డ పై విమర్శలా …… తెలంగాణ ఉద్యమం లో, ఇప్పుడు పునర్నిర్మణం లో కవిత అక్క పాత్ర ఏంటో ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు ..మరి మీ పాత్ర, మీ కుటుంబాల పాత్ర ఏంటో చెప్పగలరా ???

 

డిపాజిట్ కూడా దక్కని మీకు , ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసే కవితక్క కు పోటీ అంటేనే హాస్యాస్పదం . అసలు బీజేపీ , కాంగ్రెస్ పార్టీ లు మీకు టికెట్ ఇచ్చి ఆ పార్టీ కున్న ఓటుబ్యాంక్ కూడా గల్లంతు చేసుకున్నారు !