Home / 18+ / ఫిరాయింపు నేతల జిల్లా ప్రకాశంలో ఓటర్లు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు.?

ఫిరాయింపు నేతల జిల్లా ప్రకాశంలో ఓటర్లు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు.?

ఫిరాయింపు రాజకీయాలకు పెట్టింది పేరు ప్రకాశం జిల్లా గత ఎన్నికల్లో ఈ జిల్లా నుండి ఆరుగురు వైసీపీ నుండి, ఐదుగురు టీడీపీ నుండి ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే ఫిరాయింపు రాజకీయాలతో ఐదుగురు సెకిలెక్కారు.. ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు ఇదే జిల్లానుంచి పార్టీ మారడం మామూలు విషయం కాదు.. ఈ నేపధ్యంలో ఎప్పుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించే ప్రకాశం జిల్లా ఓటరు ఈ సారి ఏం చేయబోతున్నారు.. ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరికి పట్టుందో చూద్దాం..

జిల్లాలో టీడీపీ, వైసీపీలకు సరిసమానమైన బలమైన నాయకత్వం ఉంది. జిల్లాలో ఈ ఎన్నికల్లో జిల్లాలో హోరాహోరీ పోటీ ఉండే అవకాశం ఉంది.. కీలక నేతలు పార్టీ మారడం తో రాజకీయం వేడెక్కింది. ఈసారి ఎన్నికల్లో పరుచూరి నుండి దగ్గుపాటి పోటీ చేస్తున్నారు.. ఈ ఎన్నికల్లో వైసీపీకి 7, టీడీపీకి 3 సీట్లు రావచ్చని, మిగిలిన రెండు నియోజక వర్గాల్లో తీవ్రస్థాయిలో హోరాహోరీ పోటీ ఉండనుందని తెలుస్తుంది. జిల్లా స్థాయిలో టీడీపీ పరిస్థితిచూస్తే నేతల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రి శిద్దా, సీనియర్ నేత దామచర్ల జనార్దన్‌ కు పడటం లేదు. కరణం బలరాంకు గొట్టిపాటి వర్గీయులకు గతం నుంచీ పడదు.. మాగుంట వంటి పెద్ద నాయకులు పార్టీ మారిపోవటంతో వీరందరి మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నియోజకవర్గాల వారీగా పరిస్థితులను పరిశీలిస్తే..

చీరాల..
చీరాల నియోజకవర్గంలో పరిస్థితి పూర్తిగా వైసీపీ అదుపులో ఉంది.. కొన్ని అంశాలలో టీడీపీ నాయకత్వం పోకడపై ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ అసంతృప్తితో ఉండడంతో వైసీపీలో చేరారు. దాంతో పార్టీ కార్యక్రమాల బాధ్యతను మొన్నటివరకూ పక్కన పెట్టిన కరణం బలరాం ముఖ్యమంత్రే చెప్పారు. కానీ ఆయనతో సంబంధం లేకుండా చాలామంది నాయకులు పార్టీ కార్యక్రమాలకు కనీసం ‍హాజరవ్వడం లేదు. ఇక్కడి ఆమంచి హవా ముందు ఎవరినీ పట్టించుకునే దాఖలాలు లేవు. కృష్ణమోహన్‌ బహిరంగంగా చంద్రబాబు అవినీతి, కులపిచ్చిపై చేసిన విమర్శ ఆయన భవిష్యత్తును ఓ మలుపు తిప్పినందనే చెప్పుకోవాలి. ఇక్కడ ఆమంచి ఓట్లను దెబ్బతీసేందుకు జనసేననుంచి విద్యాప్రకాశరావు అనే వ్యక్తిని బరిలోకి దించారు.

పర్చూరులో..
ఇప్పటివరకు నియోజకవర్గంలో తమకు ఎదురు లేదనుకున్న టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరడంతో కలవరపాటుకు గురయ్యారు. దగ్గుబాటికి వ్యతిరేకంగా పావులు కదిపినా స్థానిక వైసీపీ సమన్వయకర్తగా పనిచేస్తూ టికెట్ ఆశిస్తున్న రావి రామానంద బాబు అసంతృప్తి వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని వైసీపీలో కుంపట్లను రాజేయాలని చూసారు.. కానీ వీటిని పసిగట్టిన దగ్గుబాటి టీడీపీ వైపు వెళ్లిన తన అనుచరవర్గంతోపాటు అసంతృప్తి వాదులను ఏకంచేసి వైసీపీలో చేర్చుకున్నారు. ప్రత్యేకంగా తన వర్గాన్ని తయారు చేసుకున్నారు. 3 మండలాలకి సంబంధించిన 50మంది కీలక నాయకుల ఆద్వర్యంలో ఉన్న 2వేల మంది టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అయితే దగ్గుబాటి చాతుర్యత, సమయస్పూర్తి రాజకీయం, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడు కావడంతో విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

అద్దంకి..
వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయచించిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనపై ఓర్పు, నేర్పు పెద్దరికంతో ఉండే బాచిన చెంచుగరటయ్య ప్రజల సహకారం తోడై నియోజకవర్గంలో పూర్తిగా పట్టు సాధించారు. 90శాతం గ్రామాలలో పాత, కొత్త వర్గాలను కలుపుకొనిపోతున్నారు. పెద్దాయన పార్టీ వ్యవహారాల్లో సఫలీకృతులయ్యారు. కొన్నిచోట్ల అరమరికలు ఉన్నా పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. ఇక్కడి కరణం వర్గీయులు గొట్టిపాటిపై ఉన్న వ్యతిరేకతతో టీడీపీకి కాకుండా వైసీపీకి పనిచేసినా ఆశర్యం లేదు. ఇదేపంథాలో ముందుకు సాగితే పెద్దాయన గెలిచే అవకాశం ఉంటుంది.

ఒంగోలు..
ఒంగోలులో ఎమ్మెల్యే జనార్దన్‌ పార్టీపై బాలినేని పట్టు సాధించిరారు. టీడీపీలోనూ అంతర్గత కలహాలు అధికంగానే ఉన్నాయి. ప్రత్యేకించి పార్టీలోని ఒక సామాజికవర్గం వారిలో అసంతృప్తి అధికంగా ఉండటం విశేషం. ఒంగోలులో ఉండే సీనియర్‌ నాయకుల మధ్య సమన్వయలేమి కొనసాగుతోంది. పట్టుదలకు మారుపేరుగా ముందుకు సాగే బాలినేనికి ఈసారి మంచి ఫలితం ఉండొచ్చని భావిస్తున్నారు. నగరంలో ఏమాత్ర అభివృద్ధి జరగకపోవడం, వైసీపీ తరపున బాలినేని గెలిస్తే మంత్రి అవుతారనే సమీకరణాలతో వైసీపీకి ఈ సీటు బాగా కలిసొచ్చే అవకాశం కనిపిస్తోంది.

కందుకూరు..
2014లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అప్పటి వరకు కొనసాగుతున్న కుటుంబ రాజకీయాలను దాటి నియోజకవర్గంలో విజయ పతాకం ఎగురవేసింది. గడిచిన ఐదేళ్లలో ఫ్యాన్‌ గుర్తుకు కంచుకోటగా మారిన కందుకూరు నియోజకవర్గంలో ఈసారి ఆ రెండు కుటుంబాల్లో ఒక కుటుంబానికి చెందిన మాజీమంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైఎస్సార్‌ సీపీ నుంచే పోటీచేస్తుండటంతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది.

అంతేగాకుండా ఈ నియోజకవర్గంలో ఆది నుంచీ టీడీపీ అంతంతమాత్రంగానే ఉంది. దీంతో పాటు గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ నుంచి పోటీచేసి గెలిచిన పోతుల రామారావు అనంతరం టీడీపీలోకి మారి వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ప్రస్తుతం టీడీపీ నుంచి అతనే బరిలో ఉన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పినప్పటికీ ఎలాంటి అభివృద్ధీ చేయకపోగా, తెలుగు తమ్ముళ్ల అవినీతి అక్రమాలకు అండగా నిలిచారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల నిధులన్నింటినీ పచ్చ నేతలకే దోచిపెట్టారు. వీటన్నింటిపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీపరంగా, అభ్యర్థిపరంగా పూర్తిస్థాయిలో బలంగా ఉన్న వైఎస్సార్‌ సీపీదే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ విజయమని రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు.

కనిగిరి..
టీడీపీ తరపున ఉగ్ర నరసింహారెడ్డికి టికెట్ ఇచ్చారు. అటు వైసీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీచేసిన బుర్రా మధుసూదన్‌ రంగంలో ఉన్నారు. ఆయనకి యాదవ సామాజికవర్గంలో మంచి పట్టు ఉంది. అయితే రెడ్డి సామాజికవర్గంలోని నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్ర రంగంలోకి రావడంతో ఆయనకు కొంతమేర మద్దతుఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి పెరిగిన బలం, జగన్ పాదయాత్ర తనకి కలిసొస్తాయని మధు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రెడ్లు, యాదవ, కమ్మ,ఎస్సీలు ప్రధాన సామాజిక వర్గాలుగా ఉన్నాయి. వీరే గెలుపోటములని ప్రభావితం చేస్తారు. ఇక్కడ హోరాహోరీ పోటీ చెలకొనే అవకాశముంది.

దర్శి..
దర్శిలో మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో కదిరి బాబూరావును రంగంలోకి దించారు. వైసీపీ తరపున వేణుగోపాల్‌, ఆయన సోదరులు కూడా నియోజకవర్గంలో పర్యటనలు చేపట్టారు. రెండు పార్టీలు గెలుపోటములను అంచనాలు వేసుకుంటున్నాయి. వైసీపీ నియోజకవర్గంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. వైసీపీ తరపున వేణుగోపాల్‌ను కుతోడు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లిని కూడా ముందుకు పంపించింది ఆపార్టీ అదిష్టానం.. దీంతో నియోజకవర్గంలో ఇరు పార్టీల్లో హోరాహోరీ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ ఎత్తులకు పైఎత్తులతో ఓటు బ్యాంకును పెంచుకునే కార్యక్రమాలకు శ్రీకారం పలికారు. టీడీపీకే అండగా ఉంటున్న కాపు సామాజికవర్గం చీలికపై వైసీపీ ప్రధానంగా దృష్టిసారించింది. ఇంతకాలం అటు కాంగ్రెస్‌ లేదా టీడీపీపీలో మిళతమై ఉన్న సామాజికవర్గాల ప్రజలను ఆకర్షించేందుకు వైసీపీ శ్రీకారంచుట్టింది. కాపు సామాజికవర్గ ఓట్లు భారీగా ఉండడంతో వాటిని చీల్చేందుకు ఇక్కడ జనసేన అభ్యర్ధి పులి మల్లిఖార్జున రావును దించారు. అయితే ఇక్కడ టీడీపీ జనసేన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయనే భావన ప్రజలకు కలగడంతో ఈ అంశం వైసీపీకి బ్రహ్మాస్త్రంగా మారింది.

మార్కాపురం..
మార్కాపురం నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. అయితే నియోజకవర్గంలో పార్టీలో ఉన్న నాయకులలో కందుల నారాయణ రెడ్డికి ఇవ్వడంతో ఇతర వర్గాలు సహకరించడం లేదు. ముఖ్యంగా వైసీపీ అభ్యర్ది కూడా కేపీ నాగార్జున రెడ్డి కూడా రెడ్డి సామాజికవర్గమే కావడంతో బలమైన వర్గం మద్ధతు ఆయనకు ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ హవా వైసీపీకి కలిసొస్తున్నాయి. ఫిరాయింపు రాజకీయాలను ఇక్కడి ప్రజలు తిరస్కరిస్తే ఈసీటు వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోవడం ఖాయం. గత ఎన్నికలను పరిశీలిస్తే ఇక్కడ కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకే గట్టి పట్టుంది.

గిద్దలూరు..
ఓర్పుగా రాజకీయాలు చేయటం రాని ఫిరాయింపు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పరిస్థితులను చక్కదిద్దుకోలేకపోయారు. పార్టీ మారినా నిధులు రాబట్టుకుని వాటి అమలు చేయలేకపోయారు. నాయకులకు ప్రాధాన్యతనిచ్చారే తప్ప ప్రజల్లో సానుకూలత సాధించుకోలేకపోయారు. అయితే మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ హవా వైసీపీకి కలిసొస్తున్నాయి. ఫిరాయింపు రాజకీయాలను ఇక్కడి ప్రజలు తిరస్కరిస్తే ఈసీటు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోవడం ఖాయం. అన్నా రాంబాబు కూడా పేరకు వైశ్య అయినా తినేది తలకాయ కూర అని అందరూ చెప్తున్నారు.అలాగే అందరికీ తలలో నాలుకలా అన్ని వర్గాలను కలుపుకుపోతుంటారని చెప్తున్నారు.

కొండేపి..
పేరుకు ఇది ఎస్సీ నియోజకవర్గమే అయినా అంతా పెద్దోళ్లదే నడుస్తుంది. ఈ సారి ప్రతిపక్షపార్టీలో కసి, అధికార పార్టీలో అంతర్గతపోరు కొండేపి రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేస్తోంది. నియోజకవర్గంలో కొండేపి, టంగుటూరు, జరగుమల్లి, సింగరాయకొండ, పొన్నలూరు, మర్రిపూడి మండలాలున్నాయి. దశాబ్ధాల చరిత్ర చూస్తే దామచర్ల, పోతుల, బెల్లం కుటుంబాలకు చెందిన నేతల ఏలుబడే సాగింది. ఇక్కడ ఎవ్వరు గెలవాలన్నా, ఓడాలన్నా నిర్ణయించేది ఈ నలుగురే. సమస్యలతో సతమతమవతున్న కొండేపిని అభివృద్ధి చేసే విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. 28 గ్రామాలకు తాగు, 10వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు తలపెట్టిన సంగమేశ్వర ప్రాజెక్ట్ ఇంతవరకు పూర్తి కాలేదు. తనను గెలిపిస్తే సంగమేశ్వర కలను నిజం చేస్తానంటూ, ప్రభుత్వ వైద్యశాలను 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతానని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన టీడీపీ అభ్యర్ధి బాలవీరాంజనేయస్వామి అధికారంలోకి రాగానే తన హామీలు ఆటకెక్కించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నియోజకవర్గం మీదుగా రామతీర్ధం జలాలు పారుతున్నా నియోజకవర్గ దాహార్తి మాత్రం తీరడం లేదు. దీంతో నేతల తీరుపై జనం ఆగ్రహంగా ఉన్నారు. వైసీపీ అభ్యర్ధి కూడా ప్రజాపోరాటాలతో ముందుకెళ్తున్నారు. ఎస్సీ బ్యాంక్ ఇక్కడ ప్రభావితం చేస్తున్నా పోటీ హోరాహోరీ గానే ఉంటుంది.

సంతనూతలపాడు..
సంతనూతలపాడు నియోజకవర్గం ఓటరు ప్రతి ఎన్నికల్లోనూ మార్పు కోరుకున్నారు. ఇప్పటి వరకూ ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వారిలో ఎవ్వరూ వరుసగా రెండోసారి గెల వకపోవడం ఇందుకు నిదర్శనం.
గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్ధి ఆదిమూలపు సురేశ్ టీడీపీ అభ్యర్ధి బి‌ఎన్ విజయ్ కుమార్‌పై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేల హోదాలో పోటీప‌డ్డారు. య‌ర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యేగా ఉన్న సురేష్ చివ‌ర్లో వైసీపీ నుంచి పోటీ చేశారు. అలాగే అప్ప‌టి వ‌ర‌కు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న విజ‌య్‌కుమార్ చివ‌ర్లో టీడీపీలోకి జంప్ చేసి పోటీ చేశారు. హోరాహోరీ పోరులో సురేష్ విజ‌యం సాధించారు. ఈ ఎన్నికల్లో సురేశ్ తన సొంత నియోజకవర్గమైన యర్రగొండపాలెం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో వైసీపీ నియోజకవర్గ బరిలో టి.సుధాకర్ బాబుని నిలిపింది. ఇక టీడీపీ నుంచి మళ్ళీ బి‌ఎన్ విజయ్ కుమార్‌నే పోటీ చేస్తున్నారు. జనసేనతో పొత్తులో భాగంగా సీపీఎం పోటీ చేస్తుంది. వైసీపీ నుంచి గతంలో గెలిచిన అభ్యర్ధిని కాకుండా వేరే అభ్యర్ధిని దింపుతుండడంతో రెండు పార్టీలూ విజయవావకాశాలను అంచనా వేసుకుంటున్నారు.

ఎర్రగొండపాలెం..
టీడీపీ ఆవిర్భావ సమయంలో నియోజకవర్గం లేదు. పునరుద్ధరణ అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో కాం గ్రెస్‌, గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో పూల సుబ్బయ్య మినహా రెండోసారి ఏవరూ గెలవలేదు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి గెలుపొందిన పాలపర్తి డేవిడ్‌రాజు అనంతరం టీడీపీలోకి ఫిరాయించారు. ప్రస్తుతం ఆయనకు టీడీపీ టికెట్టు లభించలేదు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన బూదాల అజితారావును మళ్లీ అభ్యర్ధిగా టీడీపీ బరిలోకి దించింది. 2009లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి గెలిచిన ఆదిమూలపు సురేష్‌కు గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెం వైసీపీ టికెట్టు రాకపోవడంతో సంతనూతలపాడు నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో పార్టీ తర ఫున గెలుపొందిన డేవిడ్‌ రాజు టీడీపీలో చేరడంతో ప్రస్తుతం సురేష్‌ వైసీపీ టికెట్టు దక్కింది. దీంతో అజితారావు, సురేష్‌ మధ్య పోటీ జరుగుతోంది. ఎవరికి వారే గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, వైసీపీ హవా వైసీపీకి కలిసొస్తున్నాయి. ఫిరాయింపు రాజకీయాలు కూడా టీడీపీకి గట్టి దెబ్బ కొట్టనున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat