Home / 18+ / వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు సభ్యులు వీరే..!

వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు సభ్యులు వీరే..!

యూకే వేదికగా మే నెల 30నుండి జరగనున్న వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు బీసీసీఐ ఈ రోజు సోమవారం టీమిండియా జ‌ట్టును ప్ర‌క‌టించింది. ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో భార‌త జ‌ట్టు ఇంగ్లండ్‌లో జ‌రిగే వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాల్గొంటుంది. ముంబైలో స‌మావేశ‌మైన బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ తుది జ‌ట్టు వివ‌రాల‌ను ప్రకటించింది.ప్రపంచ కప్ లో పాల్గోనే జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్‌, కేఎల్ రాహుల్‌, విజ‌య్ శంక‌ర్‌, ఎంఎస్ ధోనీ, కేదార్ జాద‌వ్‌, దినేశ్ కార్తీక్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌, కుల్దీప్ యాద‌వ్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, జ‌శ్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, మహమ్మద్‌ షమీ చోటు దక్కించుకున్నారు.