Home / 18+ / మంటల ధాటికి కుప్పకూలిన ప్రసిద్ధ పురాతన చర్చి..

మంటల ధాటికి కుప్పకూలిన ప్రసిద్ధ పురాతన చర్చి..

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ఓ పురాతన చర్చిలో మంటలు చెలరేగడంతో ఆ మంటల ధాటికి ప్రసిద్ధ పురాతన చర్చి కుప్పకూలింది.ఈ ఘటనతో ఆ దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యింది.అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు.అయితే ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ దీనిని పునర్‌నిర్మిస్తామని ప్రకటించారు.అంతే కాకుండా ఫ్రెంచ్‌ బిలియనీర్‌ ఫ్రాంకోయిస్‌ హెన్రీ పినాల్ట్‌ చర్చి పునర్‌నిర్మాణానికి 100 మిలియన్‌ యూరోలు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.దీనిపై స్పందించిన అమెరికా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంటలు భయంకరంగా ఉన్నాయని పై నుండి నీటిని జల్లుతూ మంటలను అదుపులోకి తేవాలని కాని అలా చేస్తే చర్చి పూర్తిగా నేలమట్టం అవుతుందని అధికారులు ఆ మార్గాన్ని దూరం పెట్టారు.850ఏళ్ల చరిత్ర ఉన్న చర్చి ఆధునికీకరణ పనులు కొనసాగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం గమనార్హం.