Home / ANDHRAPRADESH / అసలు ఏప్రిల్ 11న ఏమి జరిగిందంటే..?

అసలు ఏప్రిల్ 11న ఏమి జరిగిందంటే..?

ఏపీలో ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ నేతలు చేసిన అరాచకాలు,దాడులపై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ ను కలిసి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ”గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రస్తుతం జరుగుతున్నదాడులు,ముఖ్యమంత్రి పదవిలో ఉండి అధికారాన్ని అడ్డు పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు దగ్గరుండి మరి పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు.

తనకు సంబంధించిన వ్యక్తులు పోలీస్ శాఖలోను, ఇతర శాఖలలోను పెట్టుకుని ఉపయోగించుకుంటూ దొంగ కేసులు పెడుతున్న తీరుపై పిర్యాదు చేశామని” ఆయన చెప్పారు.అంతే కాకుండా స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇనుమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్ లోకి వెళ్లారు. అంతేకాకుండా ఆ పోలింగ్ బూత్ రూం డోర్ ను లాక్ చేసుకున్నారు.ఇంతమంది సమక్షంలో కోడెల లాక్ చేసుకుని, చొక్కా చింపేసుకుంటే ఎందుకు ఆయనపై కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.

కోడెల పోలింగ్ బూత్ ను ఆక్రమించడం నేరమా?కాదా అని ఆయన ప్రశ్నించారు.అయితే జగన్ చేసిన వ్యాఖ్యలబట్టి కోడెల పై దాడులు జరగలేదు. కేవలం సింపతి కోసమే ఆయన తన చొక్కాను ఆయనే చింపుకుని బయటకు వచ్చారు. దాంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు ఆయనపై బయట దాడికి దిగారని ఆర్థమవుతుందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat